Begin typing your search above and press return to search.
స్టార్ హీరో సినిమా సీక్వెల్ కి సంకట పరిస్థితి
By: Tupaki Desk | 21 March 2023 11:11 AMకన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన కబ్జా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. పాన్ ఇండియా రేంజ్ లో ఉపేంద్ర ఈ సినిమాను ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి పాజిటివ్ రెస్పాన్స్ దక్కలేదు. సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. కన్నడంలో కాస్త పర్వాలేదు అనిపించుకున్నా ఇతర భాషల్లో మినిమం వసూళ్లు రాబట్టలేకపోయింది.
కేజీఎఫ్ రెండు పార్ట్ లుగా విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఇంకా పలు సినిమాలు కూడా రెండు పార్ట్ లుగా విడుదల అయ్యి సంచలన విజయాన్ని సొంతం చేసుకున్నాయి. కనుక కబ్జా సినిమాను కూడా రెండు పార్ట్ లుగా విడుదల చేయాలని ముందే ప్లాన్ చేశారు. ఇప్పటికే సీక్వెల్ షూటింగ్ లో సగానికి పైగా పూర్తి చేశారట.
కబ్జా మొదటి పార్ట్ నిరాశ పర్చడంతో రెండవ పార్ట్ ను గురించి ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కబ్జా మొదటి భాగంలో గెస్ట్ రోల్స్ లో కనిపించిన కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ మరియు కిచ్చ సుదీప్ లు రెండవ భాగంలో ఫుల్ లెంగ్త్ రోల్స్ లో కనిపించబోతున్నారంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు చంద్రు పేర్కొన్నాడు.
మొదటి భాగం నిరాశ పర్చితే రెండవ పార్ట్ ఫలితం ఎలా ఉంటుందో ఇప్పటికే పలు సందర్భాల్లో నిరూపితమయింది. ఇలాంటి సందర్భంలో కబ్జా రెండవ పార్ట్ విడుదలయ్యే అవకాశం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ చాలా భాగంగా పూర్తి చేయడంతో పాటు విడుదల విషయంలో సస్పెన్స్ నెలకొంది.
ఒక వేళ విడుదల చేయాలనుకున్నా కన్నడం వరకు పర్వాలేదు కానీ ఇతర భాషల్లో మినిమం బజ్ కూడా క్రియేట్ అయ్యే అవకాశం లేదు. కన్నడ స్టార్స్ నటించిన మల్టీ స్టారర్ అవ్వడంతో కబ్జా 2 కి అక్కడ మినిమం క్రేజ్ ఏర్పడే అవకాశం ఉంది. అక్కడ విడుదల అయి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే అప్పుడు సెకండ్ పార్ట్ ఇతర భాషల్లో విడుదల అయ్యే అవకాశం ఉండవచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.