Begin typing your search above and press return to search.

రానా రొమాంటిక్ ట్రిప్

By:  Tupaki Desk   |   7 Jun 2023 4:17 PM GMT
రానా రొమాంటిక్ ట్రిప్
X
టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు రానా దగ్గుబాటి. స్టార్ కిడ్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నాడు. ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు బాహుబలి సినిమాలో విలన్ గా కూడా ఆకట్టుకున్నాడు. దీంతో ఆయన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. ఇటీవల రానా నాయుడు పేరిట చేసిన వెబ్ సిరీస్ విపరీతంగా ఆకట్టుకుంది.

కాగా, రానా కొంత కాలం క్రితం మిహికను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కాగా, మిహిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలు షేర్ ఛేస్తూ ఉంటుంది. కాగా, తాజాగా తన భర్తతో కలిసి వెకేషన్ వెళ్లిన ఫోటోలు షేర్ చేసింది.

ప్రస్తుతం రానా, మహిక లు వెకేషన్ కోసం లాస్ ఎంజిల్స్ కి వెకేషన్ కి వెళ్లారు. లాస్ ఏంజిల్స్ కౌంటీ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ ని వారు సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ దిగిన ఫోటోలను మిహిక సోషల్ మీడియాలో షేర్ ఛేయగా వైరల్ గా మారాయి. ఒక ఫోటోలో మహిళ సింగిల్ గా ఉండగా, మరో ఫోటోలో రానా తో కలిసి ఉంది. ఆమె ఆ ఫోటోలో బ్లాక్ కలర్ టీషర్ట్ కి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఓవర్ కోట్ ధరించారు. దానికి మ్యాచింగ్ ప్యాంట్ జత చేశారు. ఇక రానాతో ఉన్న ఫోటోలో అయితే, ఇద్దరూ జర్కిన్స్ ధరించి ఉన్నారు. ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటో కావడం విశేషం.

కాగా, కొద్ది రోజుల క్రితం మిహిక తల్లి కాబోతోంది అంటూ వార్తలు వచ్చాయి. అయితే, అందులో ఎలాంటి నిజం లేదు అని ఆమె ఖండించారు. ఇక రానా నాయుడు వెబ్ సిరీస్ కి రెండో భాగం కూడా త్వరలో రాబోతోందని తెలుస్తోంది. ప్రస్తుతం రానా చేతిలో రాక్షసరాజు అనే సినిమా ఉంది. మరో వైపు డైరెక్టర్ తేజతో నేనే రాజు నేనే మంత్రి లాంటి మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ మూవీ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.

రానా తాను నటించడంతో పాటు, పలువురు హీరోల సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. హీరో దుల్కర్ సినిమా కి నిర్మాత నిర్మాతగా వ్యవహరిచంనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సినిమా కి కూడా ఆయన నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.