Begin typing your search above and press return to search.

స్టార్ హీరో లేటెస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్..!

By:  Tupaki Desk   |   21 April 2021 7:30 AM GMT
స్టార్ హీరో లేటెస్ట్ మూవీ పోస్టర్ రిలీజ్..!
X
మలయాళం యువహీరో దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితుడే. ఓకే బంగారం, మహానటి లాంటి సూపర్ హిట్ సినిమాలతో తెలుగులో అలరించాడు. మహానటి సినిమా తర్వాత నుండి దుల్కర్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఎప్పుడు చేస్తాడా అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఆ టైం రానే వచ్చేసింది. టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ స్ట్రెయిట్ తెలుగు హీరోగా డెబ్యూ చేయనున్నాడు. గతేడాది కాలంగా హను - దుల్కర్ కాంబినేషన్ మూవీ గురించి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తాజాగా వీరి సినిమా నుండి న్యూ లుక్ రిలీజ్ చేశారు.

ఇంకా పేరు పెట్టని ఈ సినిమా నుండి శ్రీరామనవమి పండుగ సందర్బంగా మేకర్స్ విషింగ్ పోస్టర్ (గ్లింప్స్) రిలీజ్ చేశారు. మేకర్స్ రిలీజ్ చేసిన చిన్న వీడియో క్లిప్ బట్టి సినిమాలో హీరో దుల్కర్ 'రామ్' అనే క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు అర్ధమవుతుంది. అలాగే మద్రాస్ మిలిటరీ లిటనెంట్ అధికారిగా దుల్కర్.. ఎలా ప్రేమకోసం పోరాడాడు అనే నేపథ్యంలో సినిమా తెరకేక్కుతున్నట్లు టాక్. చూడాలి మరి ఇదివరకు దుల్కర్ సోలో అనే సినిమాలో మిలిటరీ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. ఈ సినిమాను వైజయంతి బ్యానర్ పై స్వప్నదత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు కూడా హను రాఘవపూడి రెగ్యులర్ మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించనున్నాడు. ప్రస్తుతం ఫెస్టివల్ పోస్టర్ ప్రేక్షకులను విపరీతంగా అకట్టుకుంటుంది. చూడాలి మరి ఈసారి డైరెక్టర్ హను మ్యాజిక్ చేస్తాడేమో!