Begin typing your search above and press return to search.

అప్పుడు సంక్రాంతి.. ఇప్పుడు దసరా : స్టార్ హీరోస్ ఫైట్

By:  Tupaki Desk   |   29 March 2023 5:21 PM GMT
అప్పుడు సంక్రాంతి.. ఇప్పుడు దసరా : స్టార్ హీరోస్ ఫైట్
X
పండగ సీజన్‌లో సినిమాలు మినిమం గ్యారెంటీ ఆడుతాయని నిర్మాతల నమ్మకం. ఎలాగు సెలవులు కాబట్టి... కాస్త సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెడతారు. అయితే ఈ దసరాకు రిలీజ్ అయ్యే సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే... 2021 వ సంవత్సరం సంక్రాంతికి వచ్చిన హీరోలు... మళ్లీ 2023 దసరాకు తమ సినిమాలతో అలరించడానికి వస్తున్నారు. ఈ సారి ఎలాగైనా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టు కొట్టాలనే పట్టుదలతో వస్తున్నారు. అయితే అప్పటి సినిమాలు, వాటి రిజల్ట్స్... ఇప్పుడు వచ్చే సినిమాలు ఎలా ఉన్నాయో ఓ లుక్ వేద్దాం.

2021 వ సంవత్సరంలో సంక్రాంతికి వచ్చిన సినిమాలు ఓ సారి చూస్తే... మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి హిట్‌గా నిలిచింది. రవితేజ సరసన శృతి హాసన్ నటిచింది. ఇక ఈ సినిమా అప్పట్లో డబుల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.

ఇప్పుడు మళ్లీ ఈ ఏడాది ఆయన దసరాకు టైగర్ నాగేశ్వరరావు సినిమాతో అలరించడానికి వస్తున్నారు. ఈ సినిమాకు అభిషేక్ ఆగర్వాల్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ దసరా పండగ సందర్భంగా అక్టోబర్ 20వ తేదీన రిలీజ్ కానుంది. ఏ మేరకు హిట్ కొట్టనుందో చూడాలి.

ఇక అదే సంక్రాంతికి వచ్చిన హీరో రామ్ పోతినేని. ఆయన రెడ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పరాజయాన్ని మూటగట్టుకున్నారు. ఈ సినిమా కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కింది. ఇక ఈ సినిమాలో రామ్ ద్విపాత్రభినయం చేసినా.. ఫలితం రాలేదు. ఇక ఈ ఏడాది దసరాకు రామ్.. దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌తో కలిసి వస్తున్నాడు. ప్రస్తుతానికి ఈ సినిమా టైటిల్ ఫిక్స్ కాలేదు కానీ.. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఈ దసరా పండక్కి అక్టోబర్ 20న రిలీజ్ కానుంది.

ఇక 2021 సంక్రాంతికి తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్, దళపతి విజయ్ కాంబోలో వచ్చిన మాస్టర్ సినిమా వచ్చి.. సూపర్ హిట్‌గా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూత్‌ను ఆకట్టుకున్నాయి. ఇక ఈ దసరాకు ఈ కాంబో మరోసారి రిపీట్ కానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ హీరోగా లియో సినిమా ఈ దసరాకు రిలీజ్ కానుంది. అక్టోబర్ 20వ తేదీన థియేటర్లలో అడుగుపెట్టనుంది. అయితే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఎందుకంటే.. ఈ సినిమా విక్రమ్, ఖైదీ సినిమాలకు లింక్ ఉంటుందని ప్రచారం జరుగుతుంది.

ఇక ఏది ఏమైనా.. అప్పుడు సంక్రాంతికి వచ్చిన హీరోలు మరోసారి.. దసరా పండక్కి వచ్చి ప్రేక్షకులను అలరించనున్నారు. అయితే అప్పుడు రిజల్ట్స్ చూస్తే.. విజయ్, రవితేజ హిట్ కొట్టగా.. రామ్ పోతినేనికి మాత్రం పరాజయం మిగిలింది. ఈసారి ఎవరు హిట్టు కొడతారో చూడాలి ఇక.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.