రీమేక్ లో పవన్ కూతురిగా.. స్టార్ హీరో డాటర్?

Sun Jan 29 2023 14:00:01 GMT+0530 (India Standard Time)

Star Hero Daughter in Pawan Kalyan Remake Film

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో చేయబోయే హరిహర వీరమల్లు సినిమా కంప్లీట్ అయిన తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని స్టార్ట్ చేస్తాడనే సంగతి అందరికి తెలిసిందే.ఈ మూవీ కోలీవుడ్ హిట్ మూవీ తెరికి అఫీషియల్ రీమేక్ అనే విషయంపై ఇప్పటికే క్లారిటీ వచ్చింది. అయితే రీమేక్ కింగ్ గా మంచి పేరున్న హరీష్ శంకర్ తెరి స్టొరీ లైన్ మాత్రమే తీసుకొని స్క్రీన్ ప్లేని పూర్తీగా పవర్ స్టార్ ఇమేజ్ ని తగ్గట్లు మార్చేశారు.

రైటర్ కమ్ డైరెక్టర్ దశరథ్ కూడా ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో భాగం అయ్యారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. తెరి మూవీ పోలీసోడు టైటిల్ తో దిల్ రాజు తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. మరి తెలుగులో కూడా వచ్చిన సినిమాని మళ్ళీ రీమేక్ చేయడంపై ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో విజయ్ కి కూతురుగా మీనా కుమార్తె నటించింది.

ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది. విజయ్ సమంత కూతురుగా ఆమె కనిపిస్తుంది. ఆమె క్యారెక్టర్ నుంచి ఫ్లాష్ బ్యాక్ కూడా స్టార్ట్ అవుతుంది. ఇదిలా ఉంటే ఉస్తాద్ లో పవన్ కళ్యాణ్ కి కూతురుగా ఎవరు ఇప్పుడు నటిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే బన్నీ కూతురు ఆర్హ ఇప్పటికే శాకుంతలం సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది.

ఈ నేపధ్యంలో ఉస్తాద్ మూవీ కోసం బన్నీ కూతురుని ఒరిజినల్ కాన్సెప్ట్ ప్రకారం ఉన్న హీరో కూతురు పాత్ర కోసం తీసుకోవాలని హరీష్ శంకర్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే బన్నీ నుంచి కన్ఫర్మేషన్ కూడా తీసుకోవడం జరిగిందని టాక్.

ఆర్హ ఉస్తాద్ భగత్ సింగ్ లో నటిస్తే మాత్రం కచ్చితంగా ఆమె పైన ప్రత్యేకంగా ఫోకస్ పడుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆ మాత్రం కోసం ఆర్హని ఫైనల్ చేస్తారా లేదంటే ఇంకెవరినైనా ట్రై చేస్తారా అనేది వేచి చూడాలి.   నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.