101 జిల్లాల అందగాడిలా బట్టతలకు స్టార్ హీరో కవరింగ్!

Mon Sep 13 2021 23:00:01 GMT+0530 (IST)

Star Hero Covering Baldness

బట్టతలపై వెంట్రుకలు మొలిపించకపోతే పిల్లనిచ్చేదెవరు? అంటూ ఆయుష్మాన్ ఖురానా `బాలా` చిత్రంలో ఎంతో మదనపడిపోతాడు. అది నేటితరం కలతను సామాజిక సమస్యను ప్రతిబింబించింది. ఇటీవలే 101 జిల్లాల అందగాడిగా అవసరాల కలతను కూడా చూశాం. అయితే బట్టతల అనేది జన్యులోపం. వారసత్వంగా వచ్చే బట్టతలను ఎవరూ ఆపలేరు. ఇప్పుడున్న వెటరన్ హీరోలంతా లేట్ ఏజ్ లో ఇంచుమించు బట్టతలతోనే ఉన్నారు. అయితే దానికి కవరింగ్ కోసమే గొప్ప సాంకేతిక నిపుణత ఉన్న విదేశీ వైద్యుల సాయం తీసుకుంటున్నారు. చేతి చమురు బాగానే వదులుతుందనుకోండి!రియాల్టీ చెక్ ఏమిటీ అంటే.. టాలీవుడ్ లో ఓ ప్రముఖ హీరో తనకు బట్టతల అనే విషయాన్ని ఏనాడూ బయటికి రానివ్వకుండా జాగ్రత్త పడడంలో ఎంతో ఘనాపాటిలా వ్యవహరిస్తారు!! అంటూ గుసగుస వినిపిస్తోంది. ఆ స్టార్ హీరోకి హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ విషయంలో డాక్టర్ ని సజెస్ట్ చేసింది సల్మాన్ ఖాన్ అని తెలిసింది. ఇంతకుముందు ఓ ఫ్లాప్ మూవీ తరువాత సల్మాన్ సూచనలు మేరకు దుబాయ్ లో ఉన్న ఓ హెయిర్ కేర్ స్పెషలిస్ట్ దగ్గర తన హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స చేయించుకున్నారట.

అతడు తరువాత నుంచి ఇప్పటి వరుకు అదే డాక్టర్ కి సౌత్ ఇండియా నుంచి అతి పెద్ద క్లైంట్ గా మారారని గుసగుస వినిపిస్తోంది. ఇప్పటికీ అతడు అప్పుడే ఎదిగిన టీనేజర్ లా జనం కళ్లను మోసం చేయడం హాట్ టాపిక్ గానే ఉంది. ఇక ఇదే డాక్టర్ దగ్గర బాలీవుడ్ స్టార్లు అజయ్ దేవగన్ - అక్షయ్ కుమార్ - సల్మాన్ ఖాన్- సంజయ్ దత్ తదితరులు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ ప్రక్రియను చేయించుకున్నారు. అది బాగా వర్కవుటైంది. అయితే అది చాలా కాస్ట్ లీ మ్యాటర్ అని కూడా తెలిసింది. సూపర్ స్టార్లు సాహసం చేశారు కదా అని సామాన్యులు దీనికోసం ప్రయత్నించినా చేతి చమురు బాగా వదిలించుకోవాల్సి ఉంటుంది. దానికంటే ఆత్మనిబ్బరంతో బతకడమే ఉత్తమమని చాలామంది ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నవారి అనుభవ పాఠం. బట్టతలతో పిల్లను వెతికితే టేకిటీజీ పాలసీ అనుకోవాలి.