Begin typing your search above and press return to search.
త్రిషకి ఇప్పట్లో తిరుగులేనట్టే!
By: Tupaki Desk | 8 Jan 2021 6:00 PM ISTటాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో త్రిష ఒకరు. కొంతకాలం క్రితం వరకూ ఆమె టాలీవుడ్ తెరపై తన జోరు చూపించింది. 'వర్షం' .. 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' .. 'అతడు' సినిమాలతో వరుస హిట్లు పలకరించడంతో, చాలా తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ గా నిలదొక్కుకుంది. ఆ తరువాత ఆమె స్టార్ హీరోల జోడీగా దుమ్మురేపేసింది. ఒకానొక దశలో త్రిష దూకుడును తట్టుకోవడం మిగతా హీరోయిన్స్ కి చాలా కష్టమైపోయింది. అంతలా ఆమె స్టార్ హీరోలతో సినిమాలను చుట్టబెట్టేసింది.
గ్లామర్ .. యాక్టింగ్ .. ఆ రెండింటికీ అదృష్టం కూడా తోడుకావడంతో ఆమె ఒక రేంజ్ లో దూసుకుపోయింది. ఒక వైపున తెలుగులో స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతూనే, మరో వైపున తమిళంలోను తన స్పీడ్ చూపించింది. అలా ఇటు తెలుగు .. అటు తమిళ సినిమాలను ఆమె ఎడా పెడా చేసేసుకుంటూ వెళ్లింది. నయనతార తరహాలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను కూడా చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 'నాయకి' తరువాత ఆమె తెలుగు తెరపై కనిపించలేదు. అలాగని ఆమె ఖాళీగా ఏమీ లేదు.
తమిళంలో వరుస సినిమాలతో త్రిష బిజీగా ఉంది .. అవి కూడా చిన్నాచితకా సినిమాలు కాకపోవడం విశేషం. ఒక్క తమిళంలోనే ఆమె అరడజను సినిమాలు చేస్తోంది. ఇప్పటికే చిత్రీకరణను పూర్తిచేసుకున్న 'పరమపదం విలయాట్టు' సినిమాతో ఆమె 60 సినిమాలు పూర్తిచేసేసింది. త్వరలో థియేటర్స్ లో ఈ సినిమా సందడి చేయనుంది. 'గర్జనై' .. 'శతురంగ వేట్టై' .. 'రాంగీ' .. 'పొన్నియిన్ సెల్వన్' ఇవన్నీ కూడా ఆమె క్రేజ్ ను మరింత పెంచేవిగానే కనిపిస్తున్నాయి. ఇక మలయాళంలోను మోహన్ లాల్ హీరోగా చేస్తున్న 'రామ్' సినిమాలోను ఆమె నటిస్తోంది. ఇదంతా చూస్తుంటే త్రిషకి ఇప్పట్లో తిరుగులేనట్టే అనిపిస్తోంది.