పొలిటిషన్ తో స్టార్ హీరోయిన్ డేటింగ్?

Fri Mar 24 2023 10:00:01 GMT+0530 (India Standard Time)

Star Actress Dating Politician

బాలీవుడ్ లో లివింగ్ రిలేషన్ షిప్ అనేది చాలా సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. సెలబ్రిటీలు అందరూ కూడా నిత్యం ఎవరో ఒకరితో టచ్ లో ఉంటారు. వారితో బాండింగ్ ఏర్పడితే లివింగ్ రిలేషన్ కి  రెడీ అవుతారు. ఎంత వేగంగా రిలేషన్ షిప్ లోకి వెళ్తారో అంతే వేగంగా బ్రేకప్స్ కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇక ముఖ్యంగా నార్త్ ఇండియాలో లివింగ్ రిలేషన్  బ్రేకప్ అనేది పెద్ద మ్యాటర్ గా భావించరు. అందుకే స్టార్ హీరోయిన్స్ హీరోలు వేరే ఒకరితో రిలేషన్ లో ఉన్నారని తెలిసిన కూడా మరల వారితో  టైఅప్ కావడానికి రెడీ అయిపోతారు.  బాలీవుడ్ లో ఎక్కువగా క్రికెటర్స్ హీరోయిన్స్ మధ్య ప్రేమ కథలు నడుస్తూ ఉంటాయి.

దేశంలో హైలీ ఇన్ఫ్లూయెన్స్ ఉన్న రంగాలు ఈ రెండు కావడంతో పాటు హైఫై లైఫ్ స్టైల్ మెయింటేన్ చేయడంతో వీరు రెగ్యులర్ గా కలుస్తూ ఉంటారు.  ఈ కారణంగానే హీరోయిన్స్ క్రికెటర్ల మధ్య అనుబంధం ఏర్పడుతుంది.  

కొంతమంది సెలబ్రిటీలు మాత్రం పొలిటిషియన్స్ తో రిలేషన్షిప్ ఏర్పరచుకొని పెళ్లి చేసుకుంటారు.  ఇదిలా ఉంటే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ పరిణితి చోప్రా ఢిల్లీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ చద్దాతో కెమెరా కంటికి చెక్కింది. ప్రస్తుతం వీరిద్దరి ఫోటోలు వైరల్ గా మారాయి.  ఓ ఇంటి నుంచి వీరిద్దరూ బయటకొస్తూ కారు ఎక్కడం విశేషం. వీటిని ఫోటోలలో బంధించి సోషల్ మీడియాలో సర్కులేట్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి.

ఈ నేపథ్యంలో రాఘవ్ చద్దాతో పరిమితి చోప్రా  డేటింగ్ లో ఉందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అలాగే వీరిద్దరి మధ్య రిలేషన్ ఎలా ఏర్పడింది అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

ఏది ఏమైనా బాలీవుడ్ లో ఎక్కువగా లివింగ్ రిలేషన్ కథలకు దూరంగా ఉంటే పరిణితి చోప్రా కూడా ఇప్పుడు ఆ జాబితాలోకి చేరుకోవడం విశేషం.  అయితే ఇండస్ట్రీకి చెందిన వారితో కాకుండా ఆమె రాజకీయ నాయకుడితో కనిపించడం ప్రత్యేకత అని చెప్పాలి. మరి ఈ ఫోటోలపై వీరిద్దరు ఎలాంటి క్లారిటీ ఇస్తారు అనేది ప్రస్తుతం బిటౌన్ లో ఆసక్తికర అంశంగా మారింది.  నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.