ఉస్తాద్ రామ్ ఎనర్జీకి తగ్గ పిల్లను వెతికారు!

Tue Oct 04 2022 10:35:20 GMT+0530 (India Standard Time)

Srileela's double dhamaka against Ram!

ఇద్దరు ఎనర్జిటిక్ డ్యాన్సర్లు ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఒక అరుదైన అవకాశం తెలుగు ప్రేక్షకులకు లభించనుంది. ఇంతకీ ఎవరీ డ్యాన్సింగ్ పెయిర్? అంటే.. రామ్ పోతినేని- శ్రీలీల జంట గురించే ఇదంతా. వివరాల్లోకి వెళితే...ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ భారీ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ఉస్తాద్ రామ్ పోతినేని సరసన ఏజెంట్ ఫేం సాక్షి వైద్య కథానాయికగా ఎంపికైందని ప్రచారమైంది. కానీ దర్శకనిర్మాతలు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు. బోయపాటితో ఈ మాస్ ఎంటర్ టైనర్ కు మరింత ఎనర్జిటిక్ డ్యాన్సింగ్ క్వీన్ అవసరమని భావించారట. గ్లామర్ పరంగానూ ఎలివేషన్ ఎక్కువే ఉండాలని కోరుకుంటున్నారు. అందుకే ఇప్పుడు సాక్షి వైద్య స్థానంలో శ్రీలీలను ఎంపిక చేసారని గుసగుస వినిపిస్తోంది.

శ్రీలీల నటించిన తొలి చిత్రం పెళ్లి సంద-డితో అందరి దృష్టిని ఆకర్షించింది. అందానికి అందం.. ఎనర్జిటిక్ నటన.. అద్భుతమైన నృత్య నైపుణ్యంతో ప్రేక్షకులను అలరించింది. అలాంటి భామ ఉస్తాద్ రామ్ కు జోడీగా సరిపోతుంది. తన అద్భుతమైన స్టెప్పులతో ఆకట్టుకునే రామ్ కి జోడీగా శ్రీలీల నుంచి అంతే ఎనర్జిటిక్ స్టెప్పులను ఆశించవచ్చు. ఈ చిత్రం నుండి కొన్ని అద్భుతమైన డ్యాన్స్ మూమెంట్స్ ఈ జోడీ అందిస్తుందనడంలో సందేహం లేదు.

ఈ యంగ్ బ్యూటీ ప్రస్తుతం రవితేజ సరసన ధమాకాలో నటిస్తోంది. నవీన్ పోలిశెట్టి సరసన జూనియర్లోనూ నటిస్తోంది. దసరా పండుగ రోజున అంటే అక్టోబర్ 5 న రామ్ - శ్రీలీల మూవీ గురించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలిసింది.

బాలయ్య సినిమాలో కీలక పాత్ర?యంగ్ హీరోయిన్ శ్రీలీల తొలి సినిమా విడుదలైన తర్వాత పూర్తిగా లుక్ మార్చేసింది. ఇప్పుడు బరువు తగ్గి స్లిమ్ గా కనిపిస్తోంది. మాస్ రాజా రవితేజతో కలిసి ధమాకా లో నటిస్తుంగానే తదుపరి నటసింహా నందమూరి బాలకృష్ణ సినిమాలోనూ ఓ కీలక పాత్ర పోషిస్తుందని కథనాలొచ్చాయి. ఎఫ్ 3 తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వం వహించనున్న బాలయ్య చిత్రానికి శ్రీలీల సంతకం చేసినట్లు ఇంతకుముందు టాక్ వినిపించినా కానీ ఇప్పటికీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడలేదు.

ఇందులో బాలయ్యకు హీరోయిన్ గా కనిపించదు.. ఆయనకు కూతురిగా కనిపించనుందని కథనాలొచ్చాయి. బాలయ్య 50 ఏజ్ పెద్దమనిషిగా ఇందులో కనిపిస్తారు. అతడి జీవితానికి సంబంధించిన కథాంశంలో కూతురు పాత్ర రక్తి కట్టిస్తుందట. నటసింహాకు కూతురిగా నటించేందుకు శ్రీలీలాను తగిన నటిగా గుర్తించి అనీల్ రావిపూడి ఆఫర్ ఇచ్చారని గుసగుసలు వినిపించాయి.

ఇది తండ్రీకూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కొత్త కోణాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తుందని కూడా సమాచారం. మరోవైపు ఈ సినిమాలో బాలయ్య భార్యగా మరో స్టార్ హీరోయిన్ కాస్త ఏజ్డ్ హీరోయిన్  నటిస్తుందని టాక్ వినిపించింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.