అంతకుమించి అనేలా దసరా శ్రీకాంత్!

Fri Mar 31 2023 13:00:00 GMT+0530 (India Standard Time)

Srikanth Odela Success With Dasara

లెక్కల మాస్టర్ అని ముద్దుగా పిలుచుకునే సుకుమార్ టాలీవుడ్ లో దర్శకుడిగా తనదైన ముద్ర వేసుకున్నాడు. ఆయన చేసే అన్ని సినిమాలు ఆలోచింపజేసే విధంగా ఉంటాయి లాజికల్ గా ఎవరూ ఊహించని టాపిక్స్ కూడా తీసుకుంటూ ఆయన ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఉంటాడు. ఆయన మాత్రమే కాదు ఆయన దగ్గర పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇప్పుడు డైరెక్టర్లుగా మారుతూ తమదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. గురువును మించిన శిష్యులుగా మారుతూ మొదటి సినిమాలకే బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటున్నారు. 2021 లో దర్శకుడుగా మారిన బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో హిట్టు అందుకున్నాడు.

ఇక తాజాగా దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల కూడా అలాంటి హిట్ అందుకున్నాడు. వాస్తవానికి బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో టెక్నికల్ గా కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నా సరే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయి వంద కోట్లు కలెక్షన్స్ రాబట్టింది.

దసరా కూడా ఇప్పుడు భారీ కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది. ఒకరకంగా బుచ్చిబాబు కంటే దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెల సినిమా టేకింగ్ విషయంలో టెక్నికల్ అంశాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టు అనిపించింది. అక్కడక్కడా కొన్ని కొన్ని ఇబ్బందులను విశ్లేషకులు ఎత్తి చూపిస్తున్నా ఓవరాల్ గా ఆడియన్స్ మాత్రం దసరా సినిమాకి బాగా కనెక్ట్ అయిపోయారు.

 ఉప్పెన సినిమాకు దర్శకత్వం వహించిన బుచ్చిబాబుకి ఏకంగా రెండో సినిమా రామ్ చరణ్ డైరెక్ట్ చేసే అవకాశం లభిస్తే ఇప్పుడు మొదటి సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో అందరి గుర్తింపు సంపాదించేసిన శ్రీకాంత్ ఓదెలకు ఎలాంటి అవకాశం రాబోతుంది అనే విషయం మీద చర్చ జరుగుతోంది.

నిజానికి ఈ దసరా సినిమా ప్రమోషన్స్ లో నాని అనేకసార్లు శ్రీకాంత్ పనితనం గురించి మెచ్చుకుంటూనే ఉన్నారు. వాస్తవానికి కొత్త దర్శకుడుని ఇంతగా మెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటి? అని అప్పుడు అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు శ్రీకాంత్ ఓదెల ఇచ్చిన అవుట్ పుట్ చూసిన తర్వాత అందరూ అదే ఫీల్ అవుతున్నారు.       


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.