మరో క్రేజీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుడుతున్న శ్రీకాంత్ అడ్డాల..?

Sat Jun 25 2022 09:25:55 GMT+0530 (IST)

Srikanth Addala preparing for another crazy multistarrer ..?

టాలీవుడ్ లో ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. కథ నచ్చితే స్టార్ హీరోలు సైతం కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ - ఏఎన్నార్ - కృష్ణ - కృష్ణం రాజు - శోభన్ బాబులు కలిసి స్క్రీన్ షేర్ చేసుకోడానికి ఎలాంటి అభ్యంతరాలు చెప్పేవారు.కానీ ఆ తర్వాతి తరం హీరోలైన చిరంజీవి - నాగార్జున - వెంకటేష్ - బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలు మల్టీస్టారర్స్ చేయడానికి ముందుకు రాలేదు. అయితే వీరిలో వెంకీ కారణంగానే ఇప్పుడు ఇండస్ట్రీలో మల్టీ స్టారర్స్ ఊపందుకుంటున్నాయని చెప్పాలి.

మహేష్ బాబుతో కలిసి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా చేసాడు వెంకటేష్. అప్పటి నుంచే తెలుగులో స్టార్ హీరోలు ఒకే చిత్రంలో కలిసి నటించడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా టాలీవుడ్ లో మరో క్రేజీ మల్టీస్టారర్ లో వెంకీ భాగం కాబోతున్నారని టాక్ వస్తోంది.

మాస్ మహారాజా రవితేజ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో ఓ మూవీ చేయడానికి ప్లాన్స్ జరుగుతున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించనున్నట్లు టాక్ నడుస్తోంది.

'కొత్త బంగారులోకం' చిత్రంతో సెన్సిబుల్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన అడ్డాల శ్రీకాంత్.. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' తో మల్టీస్టారర్స్ కు శ్రీకారం చుట్టారు. చివరగా వెంకటేష్ తో 'నారప్ప' సినిమాని తెరకెక్కించారు.

ఈ క్రమంలో ఇప్పుడు వెంకటేష్ - రవితేజ కాంబోలో శ్రీకాంత్ ఓ మూవీకి రంగం సిద్ధం చేస్తున్నాడని అంటున్నారు. ఇదే నిజమైతే తెలుగులో మరో క్రేజీ మల్టీస్టారర్ చూసే అవకాశం దక్కుతుందని చెప్పాలి. మరి త్వరలో దీనికి సంబంధించి క్లారిటీ వస్తుందేమో చూడాలి.

ఇకపోతే వెంకటేష్ ఇటీవల 'ఎఫ్ 3' చిత్రంతో పలకరించారు. త్వరలో 'రానా నాయుడు' అనే వెబ్ సిరీస్ తో ఓటీటీ స్క్రీన్ మీద ఎంట్రీ ఇవ్వనున్నారు. రానా దగ్గుబాటి తో కలిసి చేస్తున్న ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. అలానే సల్మాన్ ఖాన్ ప్రస్తుతం నటిస్తున్న హిందీ సినిమాలో వెంకీ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మరోవైపు రవితేజ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాని రిలీజ్ రెడీ చేసిన మాస్ రాజా.. 'ధమాకా' 'రావణాసుర' 'టైగర్ నాగేశ్వరరావు' వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. అలానే చిరంజీవి నటించే 'వాల్తేరు వీరయ్య' చిత్రంలో స్పెషల్ రోల్ చేయనున్నారు. ఇదే క్రమంలో వెంకీతో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.