చిరంజీవి - బన్నీ కాంబోలో శ్రీకాంత్ అడ్డాల భారీ మల్టీస్టారర్..?

Wed Oct 27 2021 18:22:49 GMT+0530 (IST)

Srikanth Addala massive multistarrer with Chiranjeevi and allu arjun

'కొత్త బంగారు లోకం' సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయమైన శ్రీకాంత్ అడ్డాల.. ఫస్ట్ మూవీతోనే మంచి సక్సెస్ అందుకొని సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు - విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె' వంటి మల్టీస్టారర్ చిత్రాన్ని తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు. ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైయ్యింది. ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్స్ కు బీజం వేసింది శ్రీకాంత్ అడ్డాలే. అలాంటి దర్శకుడు ఇప్పుడు మరో భారీ మల్టీస్టారర్ కు శ్రీకారం చుట్టారని తెలుస్తోంది.శ్రీకాంత్ అడ్డాల నాలుగేళ్ళ గ్యాప్ తర్వాత వచ్చి ఇటీవల 'నారప్ప' సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. ఈ జోష్ లో ఇప్పుడు ఓ మల్టీస్టారర్ మూవీ ప్లాన్ చేస్తున్నారు. ఇన్సైడ్ వర్గాలు అందించిన ఎక్స్ క్లూజివ్ సమాచారం ప్రకారం ఇందులో మెగాస్టార్ చిరంజీవి - స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోలుగా నటించే అవకాశం ఉందని తెలుస్తోంది. 'నారప్ప' ప్రమోషన్స్ లో భాగంగా ''అన్నాయ్'' అనే ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుందని తెలిపారు.

'అన్నాయ్' సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ పీరియాడికల్ డ్రామా అని.. అది కూడా మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని శ్రీకాంత్ అడ్డాల వెల్లడించారు. ఇప్పుడున్న మార్కెట్ కి ఈ కథ చక్కగా సరిపోతుందని.. ప్రస్తుతం ఈ భారీ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని తెలిపారు. ఇందులో హీరో ఎవరనేది శ్రీకాంత్ అడ్డాల వెల్లడించలేదు. అయితే ఈ భారీ మల్టీస్టారర్ కోసం చిరంజీవి - బన్నీ లను సంప్రదిస్తున్నారని సమాచారం.

మెగా హీరోలు కలిసి సినిమా చేస్తే చూడాలని అభిమానులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా మామా అల్లుళ్లు చిరంజీవి - అల్లు అర్జున్ స్క్రీన్ షేర్ చేసుకుంటే కనుల విందుగా ఉంటుందని కామెంట్స్ చేస్తూ ఉంటారు. దీనికి తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి సినిమా చేయనున్నారని అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి. అంతెందుకు ఇప్పుడు మెగాస్టార్ చేస్తున్న 'గాడ్ ఫాదర్' సినిమాలో బన్నీ ఓ పాత్ర చేస్తారని రూమర్స్ వచ్చాయి. కానీ ఏవీ నిజం కాలేదు.

అయితే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల మెగా అభిమానుల కోరిక తీర్చబోతున్నారని అంటున్నారు. మెగా మామా అల్లుళ్ళను దృష్టిలో పెట్టుకొని.. వారికి తగినట్లుగా పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేస్తున్నారట. ఇప్పటికే మహేష్ - వెంకీ వంటి ఇద్దరు స్టార్ హీరోలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన అడ్డాల.. వారి ఫ్యాన్స్ ని కూడా మెప్పించారు. ఇప్పుడు చిరు - బన్నీ లకు కూడా అదే విధంగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది.

ఇదే కనుక నిజమైతే చిరంజీవి - బన్నీ కలయిక బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని చెప్పవచ్చు. ప్రస్తుతం వీరిద్దరూ వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేస్తారని అంటున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్ నడుస్తోంది. మరి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోయే ఈ భారీ మల్టీస్టారర్ కు సంబంధించిన నిజానిజాల మీద క్లారిటీ త్వరలోనే వస్తుందేమో చూడాలి.