Begin typing your search above and press return to search.

అఖండ నిర్మాతతో అడ్డాల.. చిన్న అప్డేట్ తో బిగ్ ఇంపాక్ట్!

By:  Tupaki Desk   |   30 May 2023 3:00 PM GMT
అఖండ నిర్మాతతో అడ్డాల.. చిన్న అప్డేట్ తో బిగ్ ఇంపాక్ట్!
X
నందమూరి బాలకృష్ణ తో అఖండ సినిమాను నిర్మించిన ద్వారక క్రియేషన్స్ మిర్యాల రవీందర్ రెడ్డి ఏ స్థాయిలో సక్సెస్ అందుకున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆ సినిమా తర్వాత ఆ బ్యానర్ లో కూడా సినిమాలు చేసేందుకు చాలామంది స్టార్ దర్శకులు, హీరోలు ఆసక్తిని చూపించారు. అయితే ఈ క్రమంలో ద్వారక క్రియేషన్స్ ఊపించిన విధంగా సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాలతో సినిమా చేసేందుకు సిద్ధమైంది.

ఈ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అని ఇదివరకే ఒక టాక్ వినిపించిన విషయం తెలిసిందే. ఇక మొత్తానికి అధికారికంగా కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే ఎలాంటి సినిమా రాబోతోంది ఆ సినిమా టైటిల్ ఏమిటి అలాగే నటీనటులు ఎవరు అనే విషయంలో మాత్రం కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ఇక ఆ విషయంలో కూడా చిత్ర యూనిట్ అఫీషియల్ క్లారిటీ ఇవ్వడానికి రెడీ అయింది.

జూన్ 2వ తేదీన ఉదయం 11:39 గంటలకు

సినిమాకు సంబంధించిన పోస్టర్ టైటిల్ విడుదల చేయబోతున్నట్లు ఒక స్పెషల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో మరకలతో అంటుకున్న చేయి కనిపిస్తోంది. చూస్తుంటే మరోసారి శ్రీకాంత్ అడ్డాల ఊహించని విధంగా సరికొత్త తరహాలో ఆకట్టుకుబోతున్నట్లు తెలుస్తోంది.

చివరగా నారప్ప రీమేక్ తో బాగానే మెప్పించిన శ్రీకాంత్ ఈసారి తను సొంతంగా రాసుకున్న కథతోనే సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు అర్థమవుతుంది. ఇక ద్వారకా క్రియేషన్స్ ప్రొడక్షన్లో సినిమా వస్తుంది అంటే తప్పకుండా సినిమాల హై వోల్టేజ్ స్టోరీ ఉంటుంది అని చెప్పగానే చెప్పవచ్చు.

అఖండ సినిమాతో భారీ స్థాయిలో సక్సెస్ అందుకున్న మిర్యాల రవీందర్ రెడ్డి ఈసారి శ్రీకాంత్ అడ్డాలో దర్శకత్వంలో నిర్మిస్తున్న సినిమాను కూడా అదే తరహాలో తెరపైకి తీసుకురాబోతున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు జూన్ రెండవ తేదీన తెలియజేయమన్నారు. మంచి కమర్షియల్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న శ్రీకాంత్ అడ్డాలకు కూడా ఈ సినిమా చాలా కీలకమ కానుంది. మరి ఎలాంటి ఫలితాన్ని అందుకుంటారో చూడాలి.