Begin typing your search above and press return to search.

షూటింగ్‌ కు రెడీ అవుతున్న యంగ్ హీరో

By:  Tupaki Desk   |   26 Sep 2020 11:10 AM GMT
షూటింగ్‌ కు రెడీ అవుతున్న యంగ్ హీరో
X
కరోనా కారణంగా ఆరు నెలల పాటు షూటింగ్స్‌ కు దూరంగా ఉన్న సినిమా స్టార్స్‌ మళ్లీ షూటింగ్ బాట పడుతున్నారు. కరోనా కేసులు వేలల్లో నమోదు అవుతున్నా కూడా ఇంకా ఎన్నాళ్లు ఇంట్లోనే ఉంటాం అన్న ఉద్దేశ్యంతో టాలీవుడ్‌ కు చెందిన దాదాపు 85 శాతం మంది షూటింగ్‌ కు రెడీ అయ్యారు. మరికొందరు వచ్చే నెల నుండి ఇంకొందరు నవంబర్‌ నుండి షూటింగ్‌ లో జాయిన్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. యంగ్ హీరోలు ఇప్పటికే పలువురు సెట్స్‌ పైకి వెళ్లారు. త్వరలో మరో యువ హీరో శ్రీ విష్ణు కూడా షూటింగ్‌ లో జాయిన్‌ కాబోతున్నాడు.

లాక్‌ డౌన్‌ కు ముందే శ్రీ విష్ణు 'రాజ రాజ చోర' సినిమా ప్రారంభం అయ్యింది. సినిమా ఫస్ట్‌ లుక్‌ కూడా విడుదల అయ్యింది. రాజు వేశంలో ఉన్న శ్రీ విష్ణు పరిగెడుతున్న స్టిల్‌ అందరిని ఆకట్టుకుంది. వినోదాత్మకంగా సినిమా ఉంటుందని పోస్టర్‌ ను చూస్తుంటే అనిపిస్తుందని అప్పుడు కామెంట్స్‌ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమా షూటింగ్‌ ను పునః ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. వచ్చే నెల నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ కు వెల్లబోతున్న ఈ సినిమాలో హీరోయిన్‌ గా మేఘా ఆకాష్‌ నటిస్తోంది. హషిత్‌ గోలి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.