విడుదలకు సిద్ధమైన శ్రీరెడ్డి సినిమా.. తేదీ ఖరారు!

Tue Feb 23 2021 18:00:01 GMT+0530 (IST)

Sri Reddy Role In Climax Movie

ఇండస్ట్రీలో ఇటు తెలుగు అటు తమిళ సినీస్టార్స్ పై సంచలన కామెంట్స్ చేస్తూ పాపులారిటీ దక్కించుకున్న కాంట్రవర్సీ యాక్ట్రెస్ శ్రీరెడ్డి. ఎప్పుడో సినిమాల్లో నటించడం ఆపేసి సెలెబ్రిటీలపై వివాదాస్పద కామెంట్స్ చేయడమే పనిగా పెట్టుకున్న శ్రీరెడ్డి మళ్లీ సినిమాల్లో బిజీ అయ్యేందుకు రెడీ అవుతోంది. టాలీవుడ్ నటకిరీటి రాజేంద్రప్రసాద్ ప్రధానపాత్రలో తెరకెక్కిన 'క్లైమాక్స్' మూవీలో శ్రీరెడ్డి కీలకపాత్ర పోషించినట్లు తెలుస్తుంది. ఇటీవలే క్లైమాక్స్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు చిత్రబృందం. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ విజయ్ మోడీ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమా కాంట్రవర్సీ బిజినెస్ మ్యాన్ విజయ్ మాల్యా పై ఇండైరెక్ట్ గా తెరకేక్కించినట్లు పుకార్లు వినిపిస్తున్నాయి.'జనాలందరూ ఎవడ్రావీడు అంటూ జుట్టుపీక్కోవాలి' డైలాగ్ సినిమాపై ఆసక్తిరేపుతోంది. అయితే ఈ సినిమాలో శ్రీరెడ్డి కనిపించడం.. అలాగే తన జీవితానికి దగ్గరగా ఉండేలా ఈ సినిమాలో క్యారెక్టర్ ఉంటుందని శ్రీరెడ్డి పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుందని ఆమె స్వయంగా చెప్పడం సినిమా పై మరింత ఆసక్తి కలిగిస్తుంది. ఇప్పటికే క్లైమాక్స్ ట్రైలర్ సోషల్ మీడియాలో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది. `డ్రీమ్' సినిమాతో దర్శకుడుగా మారిన భవాని శంకర్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఇంతకాలం థియేట్రికల్ రిలీజ్ చేయడానికే వెయిట్ చేసినట్లు చెప్పారు మేకర్స్. మొత్తానికి క్లైమాక్స్ సినిమా ఫిబ్రవరి 27న థియేటర్లలోకి రాబోతుంది. నిజానికి శ్రీరెడ్డి ఉందని తెలియగానే సినిమా పై అంచనాలు పెరిగాయని టాక్. ఈ కాంట్రవర్సల్ సినిమాను పి.రాజేశ్వర్ రెడ్డి కరుణాకర్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చూడాలి మరి శ్రీరెడ్డి ప్రభావం ఎంతవరకు సినిమాకు హెల్ప్ అవుతుందో!