యష్ తో విబేధాలు.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

Fri Mar 17 2023 11:25:09 GMT+0530 (India Standard Time)

Sri NidhiShetty give Clarity on Umair Controversy

ఈ మధ్య కాలంలో స్వయం ప్రకటిత దుబాయ్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఫిలిం క్రిటిక్ గా చెప్పుకునే ఉమైర్ సంధు అనేక ఆరోపణలు చేస్తున్న ఓ సంగతి తెలిసిందే. తెలుగు హీరో హీరోయిన్లు తమిళ హీరో హీరోయిన్లు బాలీవుడ్ హీరో హీరోయిన్లు కన్నడ హీరో హీరోయిన్లను కూడా వదలకుండా తనకు నచ్చిన ఆరోపణ చేస్తూ వస్తున్నాడు.



తాజాగా అతను కేజిఎఫ్ నటి శ్రీనిధి శెట్టి గురించి కూడా కొన్ని ఆరోపణలు చేశారు. ఆమె యశ్ తో పనిచేయటానికి చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిందని అతనితో మరోసారి పనిచేయను అని చెబుతుందని ఆరోపించాడు. అతను టాక్సిక్ అని హెరాస్ చేసే వ్యక్తి అని ఆమె చెప్పినట్లుగా ఉమైర్ పేర్కొన్నాడు. అయితే ఈ విషయం మీద తాజాగా శ్రీనిధి శెట్టి స్పందించింది.

 పెద్దలు అంటూ ఉంటారు వస్తువు ఎలా ఉందనేది కాకుండా అది ఎవరి చేతిలో ఉందనే విషయం మీద ఫలితం ఆధారపడి ఉంటుందని.. కొంతమంది సోషల్ మీడియాలో ద్వేషాన్ని దుష్ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంటే నేను ప్రేమను నా జీవితంలో నేను ఎదగడానికి కారణమైన వారికి కృతజ్ఞతలు చెప్పుకోవడానికి వాడుకుంటున్నాను అంటూ ఆమె రాసుకొచ్చింది.

పదే పదే చెబుతున్నాను అనుకోకపోతే కేజిఎఫ్ వరల్డ్ కోసం యశ్ గారితో పని చేయడం నిజంగా ఒక అద్భుతమైన గౌరవం ఆయనతో పనిచేయడం అదృష్టం ఆయన ఒక నిజమైన జెంటిల్మెన్ ఒక మెంటర్ ఒక స్నేహితుడు నిజంగా ఒక ఇన్స్పిరేషన్. నేను ఎప్పటికీ మీ అభిమానురాలినే అంటూ శ్రీనిధి శెట్టి కామెంట్లు చేసింది. వాస్తవానికి ఉమైర్ చేస్తున్న వ్యాఖ్యల మీద ఇప్పటివరకు ఎవరు నేరుగా స్పందించింది లేదు.

కానీ ఎట్టకేలకు శ్రీనిధి శెట్టి ఆయన చేస్తున్న ఆరోపణలు నిజం కాదు అనే విధంగా కౌంటర్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అయితే అసలు ఈ ఉమైర్ అనే వ్యక్తి నిజంగానే ఉన్నాడా లేక కల్పిత పాత్రనా?అనే విషయం మీద కూడా ఎవరికీ క్లారిటీ లేదు. తన ఫోటోలు పెడుతున్నాడు కానీ అది ఎంతవరకు నిజమనే విషయం మీద కూడా ఎవరు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.