శ్రీను వైట్ల - మంచు విష్ణు సినిమా ఉన్నట్టా? లేనట్టా?

Mon Apr 19 2021 09:00:01 GMT+0530 (IST)

Sreenu Vaitla and Manchu Vishnu team up again

శ్రీను వైట్లకి ఇప్పుడంటే హిట్లు లేవు గానీఆయన కూడా వరుస హిట్లు ఇచ్చినవాడే. కామెడీ ఎపిసోడ్స్ ను హ్యాండిల్ చేయడంలో శ్రీను వైట్ల తరువాతనే ఎవరైనా అనిపించుకున్నవాడే. అలాంటి శ్రీను వైట్లను కొంతకాలంగా దురదృష్టం వెంటాడుతోంది. దాంతో వరుస పరాజయాలు ఆయనను ఫాలో అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన నుంచి 'ఢీ' సీక్వెల్ రానున్నట్టుగా కొంతకాలం క్రితం మంచు విష్ణు నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది. ఈ సినిమాకి 'డి అండ్ డి' అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసి పోస్టర్ కూడ వదిలారు.మంచు విష్ణు కథానాయకుడిగా శ్రీను వైట్ల 2007లో 'ఢీ' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. జెనీలియా కథానాయికగా నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం .. శ్రీహరి పాత్రలు కడుపుబ్బా నవ్విస్తాయి. ఇప్పటికీ ఆ కామెడీని మరిచిపోని వాళ్లున్నారు. మంచు విష్ణు కెరియర్లోనే ఈ సినిమా చెప్పుకోదగినదిగా నిలిచింది. దాంతో ఆ సినిమాకి సీక్వెల్ వస్తుందనే సరికి ప్రేక్షకులు ఆసక్తిని కనబరిచారు. 'ఢీ' సినిమాకి మించిన కామెడీ ఇందులో ఉంటుందని అనుకున్నారు.    

అయితే మళ్లీ ఎక్కడా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మాట వినిపించడం లేదు. మంచు విష్ణు తాజా చిత్రంగా ఇటీవల వచ్చిన 'మోసగాళ్లు' ఆయనకి భారీ నష్టాలను తెచ్చిపెట్టింది. ఈ సినిమా తరువాత ఆయన 'భక్త కన్నప్ప' ప్రాజెక్టును గురించి మాట్లాడాడు గాని 'డి అండ్ డి' సినిమాను గురించి మాత్రం అంతగా స్పందించలేదు. దాంతో ఈ సినిమా ఉన్నట్టా? లేనట్టా? అనే సందేహాం అభిమానుల్లో తలెత్తుతోంది. ఒకవేళ అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టయితే త్వరలో  అప్ డేట్ వదులుతారేమో చూడాలి.