పిక్ టాక్: జాకెట్ బటన్ విప్పిన శ్రీముఖి..!

Sun Dec 05 2021 13:00:01 GMT+0530 (IST)

Sreemukhi New Pic Viral

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు శ్రీముఖి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. యాంకర్ గా తన ముద్దు ముద్దు మాటలతో ఆకట్టుకుంటూనే.. పొట్టి పొట్టి డ్రెసుల్లో అందాలు ఆరబోస్తూ ఆడియన్స్ ని ఆకర్షిస్తోంది. ఈ క్రమంలో స్టార్ హీరోయిన్లతో సమానమైన క్రేజ్ సంపాదించుకుంది. స్మాల్ స్క్రీన్ పై షోలు చేస్తూనే.. అవకాశం వచ్చినప్పుడల్లా సిల్వర్ స్క్రీన్ పై అలరిస్తోంది.బుల్లితెరపై ‘రాములమ్మ’గా పేరు తెచ్చుకున్న శ్రీముఖి.. సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన పర్సనల్ విషయాలతో పాటుగా ప్రొఫెషనల్ విషయాలను ఎప్పటికప్పుడు ఫాలోవర్స్ తో షేర్ చేసుకుంటూ సందడి చేస్తుంది. అంతేకాదు తన హాట్ హాట్ ఫోటోలను అప్లోడ్ చేస్తూ నెట్టింట హీట్ పెంచేస్తూ ఉంటుంది.

ప్రస్తుతం ఇంటర్నెట్ లో అందాల భామ శ్రీముఖి కి సంబంధించిన హాట్ పిక్స్ సందడి చేస్తున్నాయి. వాటిలో కొన్నింట్లో జాకెట్ బటన్స్ విప్పేసి మరీ అందాలను ఆరబోస్తోంది. వింటర్ లో వేడి పుట్టిస్తున్న గ్లామరస్ యాంకర్ అంటూ యువ హృదయాలు కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు. సరైన సినిమా పడితే హీరోయిన్ గా రాణిస్తుందని ఆమె అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

కాగా 'జులాయి' సినిమాలో అల్లు అర్జున్ చెల్లెలుగా నటించిన శ్రీముఖి.. నాని 'జెంటిల్ మ్యాన్' వంటి పలు చిత్రాల్లో కీలక పాత్రలు పోషించింది. బుల్లితెర మీద యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసి తక్కువ కాలంలో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. ఈ క్రమంలో 'బిగ్ బాస్' రియాలిటీ షోలోనూ పాల్గొన ఈ అందాల ముద్దుగుమ్మ.. రన్నరప్ గా నిలిచింది. హౌస్ నుంచి బయటికొచ్చిన తరువాత శ్రీముఖి క్రేజీ ఆఫర్స్ అందుకుంది.

ఇటీవల శ్రీముఖి హీరోయిన్ గా ‘క్రేజీ అంకుల్స్’ అనే రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ తో పలకరించింది. అలానే నితిన్ హీరోగా నటించిన 'మ్యాస్ట్రో' లో కీలక పాత్ర పోషించింది. త్వరలో 'ఇట్స్ టైమ్ టు పార్టీ' అనే సైబర్ క్రైమ్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం 'ఆహా' ఓటీటీలో ఓ స్పెషల్ షో చేయడంతో పాటుగా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో పలు కార్యక్రమాలకు శ్రీముఖి హోస్టుగా వ్యవహరిస్తూ సక్సెస్ ఫుల్ కెరీర్ ను కొనసాగిస్తోంది.