శ్రీలీల.. కాస్త చూస్కో తల్లి!

Sat Apr 01 2023 11:06:14 GMT+0530 (India Standard Time)

Sreeleela Movies Lineup

ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ సెన్సేషన్ గా దూసుకుపోతున్న అందాల భామ శ్రీలీల. ఈ అమ్మడు మొదటి సినిమా పెళ్లి సందడి ఫ్లాప్ అయిన రెండో సినిమా ధమాకా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే బాలయ్య సినిమాలో కూతురు పాత్రలో నటిస్తుంది. ఇవి మాత్రమే కాకుండా ఏకంగా అరడజను సినిమాలు ఆమె చేతిలో ఉండటం విశేషం. వాటిలో కుర్ర హీరోల చిత్రాలు కూడా ఉన్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ప్రస్తుతం శ్రీలీల క్రేజ్ తో ఏకంగా 10 సినిమాల వరకు లైన్ లో పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ లిస్టులో పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ కి స్కోప్ ఉంది.

 అయితే శ్రీలీల ఏ పాత్రలో నటిస్తుంది. అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇదిలా ఉంటే ఇప్పుడు శ్రీలీల స్టార్ డమ్ ని వృధా చేసుకుంటుందా అంటే అవుననే మాట వినిపిస్తుంది. దీనికి కారణం ఆమె ప్రస్తుతం స్టార్ హీరోల చిత్రాలలో నటిస్తున్న కూడా అందులో సెకండ్ లీడ్ రోల్స్ చేస్తుంది.

 త్రివిక్రమ్ సినిమాలలో సెకండ్ హీరోయిన్ పాత్ర అంటే ఎలా ఉంటుందో గత సినిమాలు చూసిన వారికి తెలుస్తుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే తక్కువ ప్రాధాన్యత ఆ పాత్రకి ఉంటుంది.

పేరుకే సెకండ్ హీరోయిన్ అని ఇమేజ్ తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఇక బాలయ్య సినిమాలో శ్రీలీల పోషిస్తుంది హీరోయిన్ పాత్ర కాదు. బాలయ్య కూతురుగా ఆమె కనిపించబోతుంది.

 అలాగే పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా సెకండ్ లీడ్ గానే కనిపిస్తుంది అనే ప్రచారం నడుస్తుంది. ఇలా స్టార్ హీరోల చిత్రాలలో సెకండ్ లీడ్ ప్రాధాన్యత లేని పాత్రలని చేయడం ద్వారా శ్రీలీల ఇమేజ్ దెబ్బ తినడమే తప్ప కెరియర్ పరంగా పెద్దగా ఒరిగేది ఏమీ ఉండదనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తుంది.    


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.