నగ్నంగా నటించేందుకు కోట్లలో ఎర

Wed Dec 04 2019 21:31:11 GMT+0530 (IST)

Spending Crores Of Money to act

పారితోషికం ఆఫర్ చేస్తే తెర నిండుగా అందాల్ని ఆరబోసేందుకు కొందరు భామలు వెనకాడలేదు. ఆఫర్లు లేకపోయినా దిగి రావాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ఎంతగా ఆఫర్లు లేకపోయినా కట్టుబాట్లకు కట్టుబడి సరిహద్దులు దాటకుండా ఉండాలని భావించే నాయికలు ఉంటారు. పూర్తిగా వలువలు వలిచి అందాల్ని పందేరం పెట్టేయడానికి ససేమిరా అనే అనేవాళ్లు ఉన్నారు. ఇప్పుడు సౌత్ లో ఉన్న అగ్ర నాయికలు ఎక్స్ పోజ్ చేసినా టూపీస్ బికినీలు వేసినా మరీ హద్దు మీరిందేమీ లేదు.అటు బాలీవుడ్ లో అయితే కాస్తంత పట్టువిడుపు ఎక్కువే. అక్కడ ఆరబోత యమ పీక్స్ లో ఉంటుంది. ఇక బికినీలు టూపీస్ లలో వేడెక్కించడానికి ఏమాత్రం మొహమాట పడని నర్గీస్ ఫక్రి తాజాగా తనకు వచ్చిన ఓ ఆఫర్ గురించి చెప్పి పెద్ద షాకిచ్చింది. ప్రఖ్యాత ప్లేబోయ్ కవర్ పేజీ కోసం నగ్నంగా కనిపిస్తే కోట్లాది రూపాయల్ని ఎరవేసేందుకు సదరు మ్యాగజైన్ ప్రతినిధులు తనని సంప్రదించారట. అయితే అందుకు ససేమిరా అనేసిందట. తనకంటూ ఉన్న నిబంధనల గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

తెరపై అయినా అందాల్ని ఆరబోయడానికి తనకంటూ కొన్ని హద్దులు ఉన్నాయని న్యూడ్ గా కనిపించేందుకు తాను రెడీగా లేనని చెప్పింది నర్గీస్. ఇక భారతీయ నటీమణుల్లో ఒక్క  షెర్లిన్ చోప్రా మినహా ఏ భామా ఇప్పటివరకూ మ్యాగజైన్ల కోసం నగ్నంగా అందాల్ని ఆరబోసింది లేదు. సెమీ న్యూడ్ గా కనిపించిన సందర్భాలున్నాయి కానీ ప్లేబోయ్ లాంటి హీటెక్కించే కవర్ పేజీపై వేరొక బాలీవుడ్ భామ ఎవరూ కనిపించిందేమీ లేదు. ప్రస్తుతం నర్గీస్ కెరీర్ అంతంత మాత్రమే. ఓ ఆంగ్ల సిరీస్ లో నటించేందుకు రెడీ అవుతోంది.