Begin typing your search above and press return to search.

స్పీచులే సక్సెస్ ఫార్ములానా ?

By:  Tupaki Desk   |   21 May 2019 5:30 PM GMT
స్పీచులే సక్సెస్ ఫార్ములానా ?
X
అదో ట్రెండ్ గా మొదలయ్యిందో లేక హీరో పాత్రల ద్వారా ఆడియన్స్ కు క్లాసులు పీకితే హిట్లు వస్తాయని దర్శకులు అనుకోవడం వల్లనో ఏమిటో కాని టాలీవుడ్ లో ఈ మధ్య ఇలాంటి ధోరణి బాగా ఎక్కువగా కనపడుతోంది. ఆకాశమే హద్దుగా ఇమేజ్ ఉన్న మహేష్ మహర్షి క్లైమాక్స్ లో రైతుల గొప్పదనం గురించి ఓ పొడుగాటి ఉపదేశం ఇచ్చేస్తాడు. ఇప్పుడిప్పుడే హీరోగా ముద్ర వేయడానికి ట్రై చేస్తున్న అల్లు శిరీష్ ఎబిసిడిలోనూ ఇలాగే స్టేజి మీద చాంతాడంత లెక్చర్ దంచేస్తాడు. కాకపోతే ఇక్కడ మధ్య తరగతి కష్టాల గురించి ఏకరువు పెడతాడు. జెర్సీలో కొడుకు చేసేది కూడా ఇలాంటిదే. మినీ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ తీసుకుంటాడు

మజిలి-చిత్రలహరిలలో ఇలాంటివి పెద్దగా లేవు కాని విడివిడిగా హీరోల తండ్రులు క్రమం తప్పకుండ ఉపదేశాలు ఇస్తూనే ఉంటారు. సోషల్ మీడియాలో వీటిని మైమ్స్ కోసం వాడుకోవడం మాములే. వీటి సంగతి ఎలా ఉన్నా ఇవన్ని దాదాపుగా బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ గా వర్క్ అవుట్ అయినవే. వసూళ్ళ పరంగా ఆయా హీరోలకు సంతృప్తిగా నిలిచినవే. అయితే ఇలా ప్రతి సినిమాలోనూ క్లాసులు ఉపదేశాలు ఇచ్చినంత మాత్రాన హిట్లు వస్తాయని కాదు కాని రచయితల పోకడ చూస్తుంటే మాత్రం ఏదో రకంగా అలాంటి సీన్లు ఉండేలా చూసుకుంటున్నారన్న మాట వాస్తవం.

ఇంతకు ముందు ఏదో ఒక సినిమాలో ఇలాంటి సన్నివేశాలు ఉంటె ఇప్పుడు ప్రతి దాంట్లోనూ కామన్ అయిపోయాయి. దీనికి మెగాస్టార్ సైతం మినహాయింపు కాదు. ఖైది నెంబర్ 150తో మొదలుపెట్టి బాగా వెనక్కు అంటే టాగోర్ దాకా వెళ్తే అందులోనూ ఇలాంటివి ఉంటాయి. ఆ టైంలో అందరు హీరోల సినిమాలలో ఇలాంటి కంటిన్యూటి లేదు. కాని ఇప్పుడు ప్రతి ఒక్కరు వాడేస్తున్నారు. అదొక్కటే తేడా. క్లాసుల గురించి చెబుతూ ఇక్కడా క్లాస్ పీకినట్టు ఉందా. వాటి ప్రభావం అలా ఉంది మరి