Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ని చూసి చ‌ర‌ణ్ ఒణికిపోయిన రోజు అది!

By:  Tupaki Desk   |   27 March 2023 1:36 PM GMT
మెగాస్టార్ ని చూసి చ‌ర‌ణ్ ఒణికిపోయిన రోజు అది!
X
మెగాస్టార్ చిరంజీవి వార‌సుడిగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రామ్ చ‌ర‌ణ్ నేడు గ్లోబ‌ల్ స్టార్ గా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలు అందుకుంటున్నారు. తండ్రి -బాబాయ్ పవ‌న్ క‌ళ్యాణ్ లు పెద్ద స్టార్లు అయినా ఆ ప్ర‌భావం త‌న‌మీద ప‌డ‌కుండా త‌న‌కు తానుగానే ఎదిగే ప్ర‌య‌త్నం చేసి నిల‌బ‌డిన న‌టుడు. సినిమాల‌పై ఫ్యాష్ ఉంటే త‌ప్ప‌! రాణించ‌లేని రంగ‌మిది. ప‌రిశ్ర‌మ‌కొచ్చిన వార‌సులంతా స‌క్సెస్ అవ్వ‌డం అన్న‌ది అంత ఈజీ కాదు. కానీ చ‌ర‌ణ్ దాన్ని సుసాధ్యం చేసారు. ఆస్కార్ అవార్డు తో స‌రికొత్త ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా చ‌ర‌ణ్ గురించి కొన్ని ప్ర‌త్యేక సంగ‌తులు.

చ‌ర‌ణ్ కి చిన్న‌ప్పుడు చాలా సిగ్గు. అప్పుడ‌ప్పుడు అల్లు అర్జున్..శిరీష్ లు ఇంట్లో డాన్సులు వేస్తే ప్రేక్ష‌క పాత్ర త‌ప్ప సిగ్గు విడిచి తాను చేయలేని ప‌రిస్థితి. పైగా వాళకంటే బెస్ట్ డాన్స‌ర్ గా క‌నిపించాలి. ఎందుకంటే తండ్రి చిరంజీవి గ్రేట్ డాన్స‌ర్. అత‌ని స్థాయిని పెంచేలా ఉండాలి గానీ! త‌గ్గించేలా చేయ‌కూడ‌దు. దీంతో ఓరోజు అన్ని వ‌దిలేసి తాను కాలు కూడా క‌దిపాడు.

ఆ త‌ర్వాత మంచి డాన్స‌ర్ గానూ ఎదిగారు. అయితే డాన్సుల‌కు సంబంధించి చ‌ర‌ణ్ ఎవ‌రి వ‌ద్ద శిక్ష‌ణ తీసుకోలేదు. త‌నంత‌ట తానే స్వ‌యంగా డాన్సులు ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నారు. న‌ట‌న‌లో మాత్రం శిక్ష‌ణ తీసుకున్నారు.

చిన్న‌ప్ప‌టి నుంచి సినిమా వాతావ‌ర‌ణం కాబ‌ట్టి చ‌ర‌ణ్ ఎక్కువ‌గా షూటింగ్ ల‌కు హాజ‌ర‌య్యేవారు అని అంతా అనుకుంటారు. కానీ చ‌ర‌ణ్ 'రాజా విక్ర‌మార్క‌'-'లంకేశ్వ‌రుడు'- 'ఆపద్భాంధ‌వుడు' షూటింగ్ ల‌కు మాత్రమే వెళ్లిన‌ట్లు తెలుస్తుంది.

ఈ విష‌యంలో చిరంజీవి చాలా క‌ఠినంగానే వ్య‌వ‌హ‌రించేవారుట‌. సినిమా ల‌కి సంబంధించి ప్ర‌తీ విష‌యాన్ని త‌న ఆఫీస్ వ‌ర‌కే ప‌రిమితం చేసేవారుట‌. అలా ఓసారి సినిమా మ్యాజ‌గ‌జైన్ చూద్దామ‌ని ఆఫీస్ లోకి వెళ్లారుట చ‌ర‌ణ్‌. అదే స‌మ‌యంలో చిరంజీవి రావ‌డంతో ఒక్క‌సారిగా ఒణికిపోయారుట‌. ఆ రోజు ఇంట్లో పెద్ద చ‌ర్చే సాగిందిట‌. నిజానికి చ‌ర‌ణ కి చిన్న‌ప్పుడు సినిమాలంటే పెద్ద‌గా ఆస‌క్తి ఉండేది కాదుట‌.

కాల‌క్ర‌మంలో అల‌వాటు చేసుకున్న‌ట్లు తెలుస్తుంది. ఇక చ‌ర‌ణ్ స్కూల్లో యావ‌రేజ్ స్టూడెంట్. ఏ స్కూల్ చేరినా రెండేళ్లు చ‌దివేవారుట‌. ఆ త‌ర్వాత స్కూల్ మార‌డ‌మే. అలా ఎనిమిది స్కూల్స్..3 కాలేజీలు మారిన‌ట్లు తెలుస్తుంది. నాలుగో త‌ర‌గతిలో హార్స్ రైడింగ్ నేర్చుకున్నారు. పెంపుడు జంతువులంటే ఇష్టం. అందుకే ఆయ‌న ఎక్క‌డుంటే అక్క‌డ రైమ్ (కుక్క పిల్ల‌) త‌ప్ప‌ని స‌రిగా ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.