ప్రముఖ గాయకులు ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్.. స్వయంగా వెల్లడి!!

Wed Aug 05 2020 14:40:16 GMT+0530 (IST)

Sp Bala Subranyam Tested Positive For The Virus

గత కొన్ని నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలను పట్టిపీడిస్తున్న మహమ్మారి కరోనా. ఇప్పటికే లక్షల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు.. కోల్పోతున్నారు. ముఖ్యంగా భారతదేశంలో ఇంతవరకు కరోనాకు మెడిసిన్ గాని వాక్సిన్ గాని లేకపోవడంతో ప్రజలలో భయాందోళనలు ఎక్కువయ్యాయి. ఇక సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు కూడా కరోనా బారిన పడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు ఎస్ఎస్ రాజమౌళి తేజ కరోనా పాజిటివ్ తేలారు. అలాగే ఇటీవలే సింగర్ స్మితకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక ఇప్పుడు లెజెండరీ గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కూడా కరోనా పాజిటివ్ బారిన పడ్డారట. అయితే ఆయన ఆరోగ్యంగానే ఉన్నట్లు ఓ వీడియో రూపంలో స్వయంగా అందరికి సమాచారం అందించారు. ఎస్పీ బాలు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఓ వీడియో ద్వారా తెలిపారు.కొన్ని రోజులుగా తనకు జ్వరం వచ్చి పోతోందని.. అలాగే జలుబు దగ్గుతో బాధపడుతున్నట్లు తెలిపారు. అనుమానం రాగానే వెంటనే వైద్య పరీక్షలు చేయించుకున్నారట. ఇక కరోనా పరీక్షలలో తనకు కరోనా లక్షణాలు స్వల్పంగా కనిపించినట్లు వైద్యులు క్లారిటీ ఇచ్చారట. ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. డాక్టర్స్ కూడా హోమ్ క్వారంటైన్ లో ఉండాలని సలహా ఇచ్చారట. ఇక తనకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం రాగానే భారీ సంఖ్యలో ఫోన్ కాల్స్ వస్తున్నట్లు తెలిపారు. ఆ కాల్స్ అన్నీ నేను అటెండ్ చేయాలేను. దయచేసి అభిమానులు శ్రేయోభిలాషులు ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగానే ఉందని.. అభిమానుల ఆశీస్సులతో త్వరలోనే కోలుకుంటానని చెప్పారు. ఇక ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా చికిత్స కోసం చెన్నైలోని చూలాయిమేడు ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయనైతే 100% ఐయామ్ ఆల్రైట్.. అంటున్నారు కానీ ఫ్యాన్స్ లో ఇండస్ట్రీలో ఆందోళన అలాగే ఉంది.