క్రిస్మస్ సందర్భంగా 190 దేశాల్లో అలరించనున్న సౌత్ సూపర్ హీరో మూవీ..!

Thu Sep 23 2021 17:00:01 GMT+0530 (IST)

South superhero movie to be screened in 190 countries

మలయాళ స్టార్ టోవినో థామస్ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. టాలెంటెడ్ యాక్టర్ నటించిన అనేక సినిమాలు ఓటీటీలలో అందుబాటులో ఉన్నాయి. టోవినో ప్రధాన పాత్రలో నటించిన ''మిన్నల్ మురళి'' అనే సూపర్ హీరో సినిమా విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ నెట్ ఫ్లిక్స్ లో డైరెక్ట్ ఓటీటీ విధానంలో ఈ సినిమా రిలీజ్ కానుంది. తాజాగా ఓటీటీ దిగ్గజం సూపర్ హీరో సినిమా స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ మెంట్ ఇచ్చింది.క్రిస్మస్ కానుకగా 2021 డిసెంబర్ 24న ''మిన్నల్ మురళి'' చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 190 దేశాల్లో విడుదల అవుతుందని నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. మలయాళంతో పాటుగా తెలుగు తమిళ కన్నడ హిందీ ఇంగ్లీష్ భాషల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. బేసిల్ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ పై సోఫియా పాల్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఓ సాధారణ వ్యక్తి అనుకోకుండా కొన్ని ప్రత్యేక శక్తులు వచ్చి సూపర్ హీరోగా ఎలా మారాడనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది.

అతీంద్రీయ శక్తులను ఉపయోగించి దుష్టశక్తుల నుంచి ప్రజలను కాపాడే సూపర్ హీరోల సినిమాలంటే అందరూ ఇష్టపడతారు. ఏ సూపర్ హీరో సినిమా సారాంశమైనా యాక్షన్ ప్రధానంగా ఉంటుంది. కానీ 'మిన్నల్ మురళి' చిత్రంలో యాక్షన్ ని లీడ్ చేసే కారణాలను జెన్యూన్ గా ఫోకస్ చేశామని మేకర్స్ తెలిపారు. మరి టోవినో థామస్ సూపర్ హీరోగా చేస్తున్న ''మిన్నల్ మురళి'' సినిమా ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ఈ చిత్రంలో గురు సోమ సుందరం - హరిశ్రీ అశోకన్ - అంజు వర్గీస్ కీలక పాత్రల్లో నటించారు.