Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సినిమాకు దర్శకుడుగా సౌత్ స్టంట్ మాస్టర్..!

By:  Tupaki Desk   |   16 Jun 2021 9:30 AM GMT
బాలీవుడ్ సినిమాకు దర్శకుడుగా సౌత్ స్టంట్ మాస్టర్..!
X
ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో దర్శకులు మాత్రమే దర్శకత్వం చేయడం లేదు. డాన్స్ కొరియోగ్రాఫర్స్ - స్టంట్ మాస్టర్స్ కూడా దర్శకులుగా మారుతున్నారు. వారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. అయితే ఆల్రెడీ సొంతభాషలో దర్శకుడుగా పరిచయం అయిన ఓ స్టంట్ మాస్టర్ ప్రస్తుతం బాలీవుడ్ సినిమా దర్శకుడుగా డెబ్యూ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. ఆల్రెడీ సౌత్ టు బాలీవుడ్ ఇండస్ట్రీ వరకు స్టార్ హీరోలకు ఫైట్స్ కంపోజ్ చేసి ఇప్పుడు వారికే యాక్షన్ కట్ చెప్పే ప్లాన్ లో ఉన్నాడు స్టంట్ డైరెక్టర్ రవివర్మ. బేసిగ్గా కన్నడ ఇండస్ట్రీలో కెరీర్ ప్రారంభించిన రవవర్మ.. సౌత్ టు నార్త్ వరకు ఎన్నో సినిమాలకు వర్క్ చేసాడు.

తెలుగులో కూడా స్టార్ హీరోలతో వర్క్ చేసాడు. యాక్షన్ డైరెక్టర్ గా కొనసాగుతూనే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా రుస్తమ్‌ సినిమాతో దర్శకుడుగా మారాడు. స్టంట్ కొరియోగ్రాఫర్ నుండి దర్శకుడుగా మారి ప్రస్తుతం తన రెండవ సినిమా కోసం రెడీగా ఉన్నాడు. లాక్డౌన్ సమయంలో తన సినిమాలకు సంబంధించి స్క్రిప్ట్ కూడా సిద్ధం చేసుకున్నాడట. తాజాగా తన తదుపరి సినిమా విషయాన్నీ ఆయనే స్వయంగా మీడియాలో వెల్లడించాడు. సెకండ్ వేవ్ లాక్డౌన్ సమయంలో తాను రెండు స్క్రిప్ట్‌లు దాదాపు సిద్ధం చేసానని ఈ యాక్షన్ డైరెక్టర్ చెప్పాడు.

అయితే తదుపరి సినిమా మాత్రం తాను బాలీవుడ్ లో చేయాలనీ అనుకుంటున్నట్లుగా పోస్ట్ లో తెలిపాడు. "నేను సెకండ్ మూవీ హిందీలో చేయాలనుకుంటున్నాను. అందుకు సంబంధించి ప్రస్తుతం వివిధ నిర్మాణ సంస్థలతో చర్చలు జరుపుతున్నాను. ప్రాజెక్ట్ కన్ఫర్మ్ అయ్యాక నటినటులను ఎంపిక చేస్తాను. బాలీవుడ్‌లో నా స్టంట్ కొరియోగ్రఫీ గురించి ఆల్రెడీ అందరికి తెలుసు. కానీ నా రెండవ చిత్రం కాస్త భిన్నంగా ఉంటుంది. ఇది అన్ని మాస్ క్లాస్ అంశాలతో వినోదభరిత కమర్షియల్ సినిమాగా ఉండబోతుంది.” అని క్లారిటీ ఇచ్చేసాడు. ఇప్పటివరకు బాలీవుడ్ సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్, షాహిద్ కపూర్, మరియు విద్యూత్ జామ్వాల్ సహా చాలామంది బి-టౌన్ హీరోలతో కలిసి పనిచేశాడు రవివర్మ. ఇటీవలే తెలుగులో వకీల్ సాబ్ సినిమాకు యాక్షన్ డైరెక్టర్ గా వర్క్ చేసాడు. ప్రస్తుతం సెకండ్ మూవీ విషయంలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నాడు ఈ యాక్షన్ డైరెక్టర్. చూడాలి మరి బాలీవుడ్ దర్శకుడుగా సక్సెస్ అందుకుంటాడేమో!