Begin typing your search above and press return to search.
కాఫీ విత్ కరణ్ 8లో పుష్పరాజ్ కాంతార పఠాన్
By: Tupaki Desk | 31 March 2023 9:37 AMకాఫీ విత్ కరణ్ రియాలిటీ షోకి ఉన్న పాపులారిటీ తెలిసిందే. బాలీవుడ్ కింగ్ పిన్ కరణ్ జోహార్ హోస్ట్ గా ఇప్పటికే 7 సీజన్లు విజయవంతంగా నడిచాయి. ఏడో సీజన్ ఓటీటీ వేదికగా ఆశ్చర్యకరమైన విజయాన్ని నమోదు చేసింది. ఇప్పుడు సీజన్ 8తో కేజేవో బృందం తిరిగి వస్తోంది. ఈసారి షారూఖ్ ఖాన్ తో కొత్త సీజన్ ను ప్రారంభించనున్నారని.. సౌత్ నుంచి అల్లు అర్జున్- యష్ - రిషబ్ శెట్టి ఈసారి షోలో హోస్ట్ ఎదుట ముఖ్య అతిథులుగా కనిపించనున్నారని సమాచారం.
తాజా సమాచారం మేరకు.. ఈసారి అతిథుల జాబితా ఆసక్తికరంగా ఉండనుంది. ఈ సీజన్ లో ఫ్రెషర్స్ తో పాటు సుపరిచితులైన పాపులర్ స్టార్లు కనిపిస్తారని సమాచారం. సీజన్ 7 మినహా మిగిలిన అన్ని సీజన్లలో కనిపించిన షారుఖ్ ఖాన్.. పఠాన్ అద్భుత విజయం గురించి మాట్లాడుతూ సీజన్ 8ని ప్రారంభించే అవకాశం ఉందని సమాచారం.
అలాగే కేజేవో షోలో ఈసారి సౌత్ స్టార్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారని తెలుస్తోంది. దక్షిణాది తారలు ఇప్పుడు పాన్-ఇండియా స్టార్ డమ్ తో బాలీవుడ్ స్టార్లకు కఠినమైన పోటీగా మారారు. 1000 కోట్ల క్లబ్ అందుకునే హీరోలు దక్షిణాదిన ఉన్నారు. యష్ (కెజిఎఫ్ ఫేమ్-అల్లు అర్జున్ (పుష్ప ఫేమ్) - రిషబ్ శెట్టి (కాంతారా ఫేమ్) పేర్లు ఉత్తరాదినా మార్మోగుతున్నాయి.
అందుకే సదరు హీరోలను వారి వారి భార్యలు సహా ఆహ్వానిస్తారని ప్రముఖ బాలీవుడ్ మీడియా పేర్కొంది. కొత్త సీజన్ సెట్లు సహా మొత్తం షో రూపు రేఖలు మార్చేస్తున్నారని కూడా గుసగుస వినిపిస్తోంది.
మొత్తం మీద కాఫీ విత్ కరణ్ 8వ సీజన్ లో మరింత శక్తిని గ్లామర్ ని పులుముకోనుంది. ఈ షోలో మరింతగా స్టార్ల గుట్టు మట్లను బహిర్గతం చేసే అవకాశం ఉంది.
సినిమాల విషయానికొస్తే.. కరణ్ దాదాపు ఏడేళ్ల తర్వాత 'రాకీ ఔర్ రాణి కి ప్రేమ్ కహానీ'తో దర్శకుడిగా తిరిగి కంబ్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్- అలియా భట్- ధర్మేంద్ర- జయా బచ్చన్ - షబానా అజ్మీ తదితరులు నటిస్తున్నారు. జులై 28న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.