Begin typing your search above and press return to search.

టాప్ స్టోరి: సౌత్ హీరోల సైడ్ బిజినెస్ లు ప‌రేషాన్

By:  Tupaki Desk   |   10 Dec 2022 12:30 AM GMT
టాప్ స్టోరి: సౌత్ హీరోల సైడ్ బిజినెస్ లు ప‌రేషాన్
X
సౌత్ స్టార్ హీరోలకు అభిమానులు ప్రేక్షకులలో ఉన్న క్రేజ్- హైప్  పాపులారిటీ గురించి పరిచయం అవసరం లేదు. భారీ రెమ్యునరేషన్ లు అందుకుంటూ పాన్ ఇండియా  హీరోలుగాను స‌త్తా చాటుతున్నారు. ప‌లువురు హీరోలు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తోను భారీ మొత్తాల‌ను ఆర్జిస్తున్నారు. దీనికి తోడు లాభ‌సాటి వ్యాపార రంగాల్లోను ప్ర‌వేశించి ఎంట‌ర్ ప్రెన్యూర్స్ గా నిరూపించుకుంటున్నారు.

ఇప్పటికే తమ వ్యాపారాలతో మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. స్టార్ హీరోల్లో ప్ర‌భాస్- రామ్ చ‌ర‌ణ్‌-  అల్లు అర్జున్ - మహేష్ బాబు- రానా దగ్గుబాటి వంటి స్టార్లు వ్యాపారవేత్తలుగా సంస్థానాల‌ వ్యవస్థాపకులుగా ను స‌మ‌ర్థ‌త‌ను చాటు కుంటున్నారు.

అల్లు అర్జున్

హైదరాబాద్ లోని `బఫెలో వింగ్స్` ఫ్రాంచైజీ పేరుతో బ‌న్ని బార్ ల వ్యాపారంలో ప్ర‌వేశించారు. ఈ ఫ్రాంఛైజీ ప్రారంభమై చాలా రోజులైంది. బ‌న్నీకి 800 జూబ్లీ పేరుతో ప‌బ్ ర‌న్నింగ్ లో ఉంది. ఇది కాకుండా అత‌డి భార్య స్నేహారెడ్డికి పిక్-ఎ-బూ అనే ఫోటో స్టూడియో ఉంది. అల్లు అర్జున్ ఇటీవల సినిమా థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఏషియన్ సినిమాస్ తో కలిసి దానికి AAA సినిమాస్ అని పేరు పెట్టాడు. ప్రస్తుతం మ‌ల్టీప్లెక్స్ థియేటర్ నిర్మాణ ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే ప్రారంభించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు.

మహేష్ బాబు

మ‌హేష్ బాబు సినిమాలు వేగంగా చేయ‌క‌పోయినా.. ప్రతి సంవత్సరం భారీగా వాణిజ్య ప్రకటనలకు సంతకం చేస్తున్నాడు. ఎన్నో పాపుల‌ర్ బ్రాండ్ లకు అంబాసిడర్ గా ఉన్నారు. మ‌రోవైపు  హైదరాబాద్ లోని ఆసియన్ సినిమాస్ తో క‌లిసి మహేష్ బాబు థియేటర్ల వ్యాపారంలోకి ప్రవేశించాడు. ఏఎంబీ మాల్ పేరుతో ఇంత‌కుముందే ప్రారంభ‌మై పెద్ద సక్సెసైంది. ఏఎంబీ నగరంలోని సాఫ్ట్ వేర్ హ‌బ్  గ‌చ్చిబౌళి ప‌రిస‌రాల్లో ఉంది. మహేష్ భార్య నమ్రత తమ మొట్టమొదటి రెస్టారెంట్ ను  ఆసియన్ గ్రూప్ తో కలిసి ప్రకటించ‌డం ఆస‌క్తిక‌రం. వీటికి AN రెస్టారెంట్లు - మినర్వా కాఫీ షాప్ అంటూ ఆస‌క్తిక‌ర‌మైన పేర్లు పెట్టారు.

రామ్ చరణ్ తేజ్

RRR తో పాన్ ఇండియా స్టార్ గా స‌త్తా చాటిన రామ్ చ‌ర‌ణ్‌  విమానయాన రంగంలో ప్ర‌వేశించ‌డం ఒక సంచ‌ల‌నం. ట్రూజెట్ పేరుతో త‌క్కువ దూరాల‌కు ప్ర‌యాణీకుల‌ను చేర‌వేసే ఎయిర్ లైన్స్ సంస్థ ఇది. ఇది టర్బో ఏవియేషన్ కి అనుబంధ సంస్థ. అనేక విమానాల నిర్వహణ  గ్రౌండ్ హ్యాండ్లింగ్ కు బాధ్యత వహిస్తుంది. అలాగే చ‌ర‌ణ్ ఇప్ప‌టికే కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి మెగాస్టార్ క‌థానాయ‌కుడిగా సినిమాల‌ను నిర్మిస్తున్నారు. ఇటీవలి చిత్రం ఆచార్య బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచినా గాడ్ ఫాద‌ర్ పెద్ద స‌క్సెసైంది. చ‌ర‌ణ్ స‌తీమ‌ణి ఉపాసన కొణిదెలకు అపోలో హాస్పిటల్స్ కీల‌క వాటా దారు. అన్నింటికీ మించి హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్ యజమానిగా చ‌ర‌ణ్ పేరు మార్మోగింది.

నాగార్జున అక్కినేని

కింగ్ నాగార్జున‌కు వ్యాపారాలు కొత్తేమీ కాదు. సొంత‌ నిర్మాణ సంస్థ అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రధాన వాటాను కలిగి ఉన్నాడు. ఇది కేవలం నిర్మాణ సంస్థ మాత్రమే కాదు. హైదరాబాద్ లోని అత్యంత ఖరీదైన ప్రాంతంలో 7 ఎకరాల విస్తీర్ణంలో స్టూడియోను కలిగి ఉంది. దీనిని అన్నపూర్ణ ఏడెకరాలు అంటారు. ఇది కాకుండా అన్నపూర్ణ స్టూడియోస్ అనే మరో స్టూడియో కూడా అక్కినేని నాగార్జునకు ఉంది. అన్నపూర్ణ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ న‌గ‌రంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఇవి కాకుండా హైదరాబాద్ లో కొన్ని రెస్టారెంట్లు - కన్వెన్షన్ సెంటర్ లు ఉన్నాయి.

ద‌ళ‌పతి విజయ్

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన స్టార్ హీరో విజ‌య్ నెమ్మ‌దిగా త‌న మార్కెట్ ప‌రిధిని పొరుగు భాష‌ల‌కు విస్త‌రిస్తున్నాడు. ప్రస్తుతం తన తదుపరి చిత్రం `వారసుడు` (వారిసు) విడుదల కోసం వేచి చూస్తున్నాడు. తమిళనాడులో అనేక కళ్యాణ మండపాలు  కన్వెన్షన్ సెంటర్ ల నిర్వ‌హ‌ణ‌లో ఉన్నాడు. వీటికి త‌న కుటుంబ సభ్యుల పేర్ల‌ను పెట్టినట్లు చెబుతున్నారు. అలాగే శ్రీలంకలో విజ‌య్ కొన్ని థియేటర్లను ర‌న్ చేస్తున్నాడ‌నే విష‌యం చాలామందికి తెలియదు.

ప్ర‌భాస్:

బాహుబ‌లి స్టార్ ప్ర‌భాస్ కుటుంబానికి తొలి నుంచి సినిమాల నిర్మాణం పంపిణీ రంగంలో అనుభ‌వం ఉంది. ప్ర‌భాస్ సొంతంగా మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల చైన్ వ్యాపారాన్ని ప్రారంభించారు. అత‌డు వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్లో న‌టించేందుకు ఆస‌క్తిగా ఉండ‌డు. కేవ‌లం సినిమాలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నాడు.

రానా దగ్గుబాటి

ప్రముఖ టాలెంట్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అయిన KWANలో రానా కీలకమైన పొజిష‌న్ లో ఉన్నాడు. రానా ఈ సంస్థ కు సహ వ్యవస్థాపకుడు. ప్రొడక్షన్ హౌస్- మ్యూజిక్ లేబుల్ వ్యాపారంతో పాటు అమర్ చిత్ర కథ అనే కామిక్ బుక్ కంపెనీ ని అత‌డు ప్రారంభించాడు. టెక్ స్టార్ట్-అప్ ల కోసం బిజినెస్ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ ను రానా ర‌న్ చేస్తున్నాడు. రామానాయుడు స్టూడియోస్ లో యానిమేష‌న్ కోసం ప్ర‌త్యేకించి ఒక డివిజ‌న్ ని ర‌న్ చేస్తున్నారు.

ఆర్య

ఈ హీరోకి సీ షెల్ అనే సౌత్ ఇండియన్ రెస్టారెంట్ ఉంది. అతను ది షో పీపుల్ అనే ప్రొడక్షన్ హౌస్ ని ప్రారంభించి సినిమాలు నిర్మిస్తున్నాడు. ఈ బ్యాన‌ర్ లో ప‌లు విజయవంతమైన చిత్రాలను నిర్మించాడు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.