ఐపీఎల్ హడావుడిలో సౌత్ బ్యూటీలు

Fri Mar 31 2023 10:25:10 GMT+0530 (India Standard Time)

South Beautys in IPL Launch

ఇండియాలో సినిమా తర్వాత అత్యంత ప్రజాదరణ ఉన్నది అంటే అది క్రికెట్ అని చెప్పాలి. క్రికెట్ లోకి టి20 వచ్చిన తర్వాత మరింత ఆదరణ పెరిగింది. కమర్షియల్ గా కూడా క్రికెట్ సెలబ్రిటీలకు కోట్ల రూపాయలు ఆదాయాన్ని టి20 లీగ్స్ తీసుకొస్తున్నాయి. ఒకప్పుడు దేశం తరఫున క్రికెట్ ఆడటం అంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేవారు. అయితే ఇప్పుడు ఐపీఎల్ లో సెలెక్ట్ కావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లీగ్ గా ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పై లక్షల కోట్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆటగాళ్లు కూడా వందల కోట్ల రూపాయలు అర్జిస్తూ ఉంటారు. ఐపీఎల్ రాకతో అన్ని దేశాలలో క్రికెట్ క్రీడాకారులు కోటీశ్వరులుగా మారిపోతున్నారు. ఐపీఎల్ లో సూపర్ సక్సెస్ అయితే వారికి మంచి డిమాండ్ ఉంటుంది.

మరల ఈ ఏడాది కూడా ఐపీఎల్ లీగ్ ప్రారంభం కాబోతోంది. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 లీగ్ గ్రాండ్ గా లాంచ్ అవుతుంది. ఈ ఐపీఎల్ ప్రారంభోత్సవ వేడుకల్లో మూవీ సెలబ్రిటీస్ పార్టిసిపేట్ చేసి లైవ్ డాన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడం ఆనవాయితీగా వస్తుంది. ఈసారి డాన్స్ పెర్ఫార్మెన్స్ చేయబోయే సెలబ్రిటీస్ లో సౌత్ ఇండియా నుంచి సోషల్ మీడియా క్రష్ రష్మిక మందన ఉండబోతూ ఉండడం విశేషం.

 అలాగే మరో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా కూడా లైవ్ డాన్స్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది. సింగర్ అర్జిత్ సింగ్ పర్ఫామెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

దాంతోపాటు బాలీవుడ్ స్టార్స్ కత్రినా కైఫ్ టైగర్ ష్రాఫ్ ఈ సెలబ్రేషన్ లో స్పెషల్ పర్ఫామెన్స్ ఇవ్వబోతున్నారు. ఈ గ్రాండ్ సెలబ్రేషన్స్ మార్చి 31న సాయంత్రం 6 గంటలకు స్టార్ స్పోర్ట్స్ జియో సినిమా లో లైవ్ ప్రసారం అవుతాయి.

ఇదిలా ఉంటే ఈసారి ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 52 రోజులు పాటు సుమారు 12 స్టేడియంలో 70 మ్యాచులు జరగబోతున్నాయి. మొదటి మ్యాచ్ గత ఏడాది డిపెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ నాలుగుసార్లు ఐపీఎల్ విన్నర్ అయిన చెన్నై సూపర్ కింగ్స్ మధ్యలో జరగబోతూ ఉండడం విశేషం. ఇక ఫైనల్ ఐపీఎల్ మ్యాచ్ మే 28 న ముగుస్తుంది. ఇక ఐపీఎల్ లీగ్ ఓపెనింగ్ గుజరాత్ లోని అత్యంత పెద్దదైన నరేంద్ర మోడీ క్రికెట్ స్టేడియంలో జరగబోతుంది.   


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.