Begin typing your search above and press return to search.

ఆ ఫేమ‌స్ న‌టుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!

By:  Tupaki Desk   |   30 May 2023 10:20 AM GMT
ఆ ఫేమ‌స్ న‌టుడు మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం!
X
బాలీవుడ్ న‌టుడు సోనుసూద్ సేవాదృక్ఫ‌ధం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఆయ‌న రీల్ హీరో కాదు..రియ‌ల్ హీరో అని ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. దేశ వ్యాప్తంగా ఎన్నో సేవా కార్య‌క్ర‌మాలు చేస్తున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా సోనూసూద్ మ‌రో మంచి పనికి శ్రీకారం చుట్టారు. పేద‌..అనాధ విద్యార్దుల కోసం బిహార్ లో ఆయ‌న స్వ‌యంగా ఓ ఇంట‌ర్నేష‌న‌ల్ స్కూల్ నిర్మించ‌బోతున్నారు. చ‌దువుకోలేని వారికి ఉచితంగా విద్య‌..వ‌స‌తి క‌ల్పించి వాళ్ల జీవితాల్లో వెలుగులు నింపాలి అన్న సంక‌ల్పంతో ఈ అడుగు వేస్తున్నారు.

అయితే ఈ స్కూల్ ని బీహార్ కి చెందిన 27 ఏళ్ల ఇంజ‌నీర్ బీరేంద్ర‌కుమార్ మ‌హా తొలుత ప్రారంభించారు. చేస్తున్న ఉద్యోగాన్ని వ‌దిలేసి మ‌రీ ఈ స్కూల్ నిర్మాణం చేప‌ట్టారు. సోనుసూద్ పై అభిమానంతో పాఠ‌శాల‌కు అత‌ని పేరు పెట్టారు. ప్ర‌స్తుతం అందులో 110 మంది విద్యార్దులు చ‌దువుకుంటున్నారు. అయితే ఈ విష‌యాన్ని సోనుసూద్ స‌న్నిహితు ద్వారా తెలుసుకున్నారు.

దీంతో సోనూసూద్ స్వ‌యంగా బీహార్ కి వెళ్లి బీరేంద్ర కుమార్ ని క‌లిసారు. అక్క‌డ మ‌రింత మెరుగైన‌ విద్య‌..వ‌స‌తి..నాణ్య‌మైన ఆహారం అందించేలా నిర్ణ‌యం తీసుకున్నారు.

ఎక్కువ మంది పిల్ల‌ల‌కు స‌రిపోయేలా ఓ పెద్ద భ‌వ‌నాన్ని నిర్మించ‌డానికి సూన్ సూద్ నిర్ణ‌యించారు. ఈ మ‌ధ్యనే ప‌నులు కూడా మొద‌లు పెట్టిన‌ట్లు స‌మాచారం. ఈసంద‌ర్భంగా సోనుసూద్ మాట్లాడుతూ.. 'అణ‌గారిగిన వ‌ర్గాల‌కు నాణ్య‌మైన విద్య‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన‌ప్పుడే వారి పేద‌రికాన్ని తిరిమేయ‌గ‌లం. వాళ్లు బాగా చ‌దువుకున్న‌ప్పుడే మంచి ఉద్యోగాల్లో స్థిర‌ప‌డ‌గ‌ల‌రు. పేద‌ల జీవితాల్లో మార్పు వ‌స్తుంది' అని అన్నారు. ప్ర‌స్తుతం సోనుసూద్ దేశ వ్యాప్తంగా ప‌దివేల మంది పిల్ల‌ల్ని ఉచితంగా చ‌దివిస్తున్నారు.

సోనుసూద్ త‌న తల్లి పేరుమీద స్కాల‌ర్ షిప్ లు అందిస్తున్నారు. అనాద పిల్ల‌లు..పేద పిల్ల‌ల జీవితాల్లో వెలుగులు నింపాల‌నే ఉద్దేశంతోనే సోనుసూద్ ఈ నిర్ణ‌యం తీసుకుని ముందుకెళ్తున్నారు. త‌న సేవా కార్య‌క్ర‌మాల్లో సంప‌న్నులు పాల్గొనాల‌ని ఆయ‌న కోరిన సంగ‌తి తెలిసిందే.

తోచిన స‌హాయం చేస్తే ఓ విద్యార్ది చ‌దువుకు ఆ స‌హాయం ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని విరాళాలు సేక‌రిస్తున్నారు. స‌హాయ నిధికి సెల‌బ్రిటీల నుంచి భారీగా విరాళాలు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం.