ఆర్జీవీ.. ``జగమొండి``లో విలన్ కారెక్టర్ సోనియాగా.. ఆమె కనపడుతుందా?

Sun Apr 18 2021 09:00:01 GMT+0530 (IST)

Is Sonia As villain  In RGV Jagamondi ?

వివాదాస్పద సినిమాలు తీయడంలో రాంగోపాల్ వర్మ.. ఉరఫ్ ఆర్జీవీ దిట్ట. అందుకే .. ఆయన తనకు తన సినిమాలకు ప్రచారం లేకుండా.. నెగిటివ్ పబ్లిసిటీతో ముందుకు వెళ్తుంటాడు. నేను మోనార్క్‌ను.. నన్నెవరూ ఏమీ చేయలేరు.. అనేలా ఇంటర్వ్యూల్లో నూ మాట్లాడుతుంటాడు. కానీ ఆర్జీవీలోనూ భయం ఉంది. ఆయన కూడా పరిస్థితులకు అనుగుణంగా జంకుతాడనే మాట కూడా వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే.. ఆరు నెలల కిందట ఓ యూనివర్సిటీకి చెందిన స్టూడెంట్లు కొందరు వచ్చి.. ``మాట్లాడుకుందాం.. తేల్చుకుందాం.. రా!`` అనేసరికి.. భయపడిపోయి.. గడప కూడా దాటలేదట!దీంతో అప్పటి నుంచి ఆర్జీవీని కేవలం `చానెల్ పులి` అనేస్తున్నారు. సోషల్ మీడియాలో అయితే.. మరింతగా ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు. అయితే.. అసలు విషయానికి వస్తే.. ఆర్జీవీ.. త్వరలో తీసే సినిమా.. ఏపీ సీఎం జగన్ మీదే. ఇప్పటికే దీనికి సంబంధించిన టైటిల్ ``జగమొండి`` అని టాలీవుడ్‌లో ప్రచారం కూడా జరుగుతోంది. సో.. దీనిని బట్టి ఇది పూర్తిగా పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉంటుందనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. చిత్రం ఏంటంటే.. ఈ సినిమాను కడప జిల్లాకే చెందిన కొందరు వైసీపీ నాయకులు పెట్టుబడులు పెట్టి మరీ తీస్తున్నారు. వీరి టార్గెట్ ఏంటంటే.. జగన్‌ను దేశంలోనే నిజమైన హీరో రూపంలో చూపించడమేనని అంటున్నారు.

దేశంలో ఎంతటి వారినైనా తన అదుపులో పెట్టుకుని నడిపించిన సోనియా గాంధీ నేతృత్వంలోని యూపీఏ ప్రబుత్వం దేశంలో అధికారంలో ఉన్నసమయంలో జగన్.. ఆ ప్రభుత్వాన్నే ఎదరించిన మొనగాడని.. అందుకే రాజకీయంగా హీరో అయ్యాడని.. ఎవరిని అడిగినా చెబుతారు. సో.. దీనిని బట్టి జగమొండి సినిమాలో విలన్ కారెక్టర్ సోనియా గాంధీ రూపంలో ఉంటుంది. అంటే.. ఆమె కారెక్టర్‌ను ఎవరు చేయాలి?  ఎవరైతే.. నార్త్ ఇండియా మార్కెట్‌ను సైతం క్యాచ్ చేయగలరు? అనే విషయాలపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఇప్పుడు నానుతున్న కారెక్టర్ కావాలి అని ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది.

సోనియాగాంధీ రూపంలో నటించే కారెక్టర్ కోసం మొదట ఇటలీ నుంచి తీసుకు వద్దామని అనుకున్నారట. కానీ చివరకు `కంగన రనౌత్` అయితే.. కారెక్టర్ సరిగా సరిపోతుందని ఆమెవైపు చూస్తున్నారట. ఇందులో ఇంటో ట్విస్ట్ ఏంటంటే.. కంగనా అయితే.. బీజేపీ ఫేవర్ వల్ల ఆ సినిమాకు మంచి మైలేజీ వస్తుందని నిర్ణయించుకున్నారట. కానీ ఇంకా ఫైనల్ కాకున్నా.. కంగనా కనుక డేట్స్ ఇస్తే.. ఖచ్చితంగా ఆమెకు సొనియా కారెక్టర్ ఇస్తారు అని టాలీవుడ్‌లో  టాక్ నడుస్తోంది. మరి చివరికి ఎవరు డిసైడ్ అవుతారో చూడాలి.