Begin typing your search above and press return to search.

హృద‌యాన్ని ట‌చ్ చేసిన‌ `గ‌మ‌నం` సాంగ్

By:  Tupaki Desk   |   28 Nov 2021 6:29 AM GMT
హృద‌యాన్ని ట‌చ్ చేసిన‌ `గ‌మ‌నం` సాంగ్
X
శ్రీ‌య ప్ర‌ధాన‌పాత్ర‌లో న‌టించిన సినిమా గ‌మ‌నం. తొలి చిత్ర‌ దర్శకురాలు సుజనారావు యూనిక్ క‌థాంశంతో ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. పట్టణీకరణ నేప‌థ్యం వానా కాలం తొల‌క‌రి జ‌ల్లుల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కిందని ద‌ర్శ‌కులు చెబుతున్నారు. ``నా సినిమాలో వానలు పాత్ర పోషించాయని నా చిన్ననాటి వర్షాకాల జ్ఞాపకాలకు ఈ ప్రాజెక్ట్ ను అంకితం చేస్తున్నాను అని తన తెలుగు చిత్రం గమనం గురించి చర్చిస్తూ దర్శకురాలు సుజనారావు అన్నారు. డిసెంబర్ 10 న థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.

తాజాగా గ‌మ‌నం నుంచి సాంగ్ ఆఫ్ లైఫ్ పేరుతో లిరిక‌ల్ సాంగ్ ని విడుద‌ల చేసారు. ఈ పాట ఆద్యంతం అద్భుత‌మైన గ‌మ‌కాలు శ్రావ్య‌మైన సంగీతం హృద‌యాల్ని ట‌చ్ చేస్తోంది. ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుద‌లైంది. కైలాష్ ఖేర్ గానం.. మ్యాస్ట్రో ఇళ‌య‌రాజా సంగీతం ఎంతో అద్భుతంగా కుదిరాయ‌నడంలో ఎలాంటి సందేహం లేదు.

గమనంలో శ్రియ శరణ్- శివ కందుకూరి- ప్రియాంక జవాల్కర్- సుహాస్- చారుహాసన్ - నిత్యా మీనన్ (అతిథి పాత్రలో) త‌దిత‌రులు నటించారు. వెంకీ పూషాడపు -రమేష్ కరుటూరితో కలిసి సినిమాటోగ్రాఫర్ జ్ఞాన శేఖర్ వి.ఎస్ నిర్మించిన ఈ సంకలన చిత్రం మూడు కథలలోని పాత్రలు కుండపోత వర్షం తరువాత వరదలను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. హైదరాబాదులో లోతట్టు ప్రాంతాలలో వరదలు వార్షిక లక్షణంగా ఎలా మారాయి? అనే విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఈ లొకేష‌న్ లో సంబంధితంగా కనిపిస్తోంది. సుజనా జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ రూపొందించిన చిత్ర‌మిది. కొన్ని సంవత్సరాల క్రితం నేను నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (NIFT)లో చదువుతున్నప్పుడు మేము సమీపంలోని వాటర్ బాడీని సందర్శించి ఫోటోగ్రాఫ్ లు తీసుకునేవాళ్లం. తర్వాత ఆ ప్రాంతాన్ని నిర్మాణ స్థలంగా మార్చడం గమనించాం. ప్రతి సంవత్సరం హైదరాబాద్ లేదా చెన్నైలో వరదలు వచ్చినప్పుడు పట్టణ అభివృద్ధి పేరుతో నీటి వనరులు ఆక్రమణకు గురవుతున్నందున అది మానవ నిర్మిత విపత్తు అని మనం అర్థం చేసుకోవాలి అని తెలిపారు. అదే నన్ను గమనం క‌థ‌ను రాసేలా చేసింది. జీవితం అనే వృత్తాన్ని సూచించడానికి ఇది శిశువు నుండి వృద్ధుల వరకు వివిధ వయస్సుల వ్యక్తులను ఎలా ప్రభావితం చేస్తుందో అన్వేషించాలనుకుంటున్నాను.. అని తెలిపారు.