కేన్స్ 2019: ఎవరండీ ఈ పంకజం!!

Sun May 19 2019 12:56:26 GMT+0530 (IST)

Sonam Kapoor at Cannes Film Festival

కేన్స్ 2019 ఉత్సవాలు వేడుకగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉత్సవాల్లో ఆలీవుడ్ అందగత్తెల డిజైనర్ లుక్స్ హీటెక్కిస్తున్నాయి. ఒక్కో భామ రకరకాల డిజైనర్ డ్రెస్సుల్లో అంతకంతకు అగ్గి రాజేస్తున్న సంగతి తెలిసిందే. ఈనెల 14న మొదలైన ఉత్సవాలు 11 రోజుల పాటు సుదీర్ఘంగా ట్రీట్ ఇవ్వనున్నాయి. కంగన.. దీపిక.. ప్రియాంక చోప్రా.. హీనాఖాన్ వంటి భామల ట్రీట్ కన్నుల పండువగా సాగింది.ఇకపై ఐశ్వర్యారాయ్.. సోనమ్ కపూర్.. డయానా పెంటీ లాంటి అందగత్తెలు ట్రీట్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. నిన్నటి సాయంత్రం ఐష్- ఆరాధ్య.. సోనమ్ - రియా కపూర్ సిస్టర్స్ కేన్స్ ఉత్సవాలు జరుగుతున్న ఫ్రెంచి రివెరాకు బయల్దేరారు. ఐష్ - ఆరాధ్య బచ్చన్ జోడీ సాయంత్రమే విమానాశ్రయంలో మీడియా కంటికి చిక్కిన సంగతి తెలిసిందే. రాత్రి 10 గం.ల ప్రాంతంలో ఫ్యాషనిస్టా సోనమ్ కపూర్ తన సిస్టర్ తో కలిసి కేన్స్ కి బయల్దేరినప్పటి ఫోటోలు వెబ్ లో కి వచ్చాయి.

రియల్ ఫ్యాషనిస్టాకి పర్యాయపదం సోనమ్. ఇంకా ఉత్సవం మొదలు కానే లేదు. అక్కడికి వెళుతూనే అమ్మడు ఇచ్చిన ట్రీట్ మామూలుగా లేదు. అదిరిపోయే వెస్ట్రన్ స్టైల్ డిజైనర్ సూట్ లో సోనమ్ స్టైలిష్ గా తళుక్కుమంది. బ్లూ యాంకిల్ లాంగ్ ఫ్యాంట్.. దానికి కాంబినేషన్ కోట్ కం జాకెట్ ని సోనమ్ ధరించింది.  అసలు సోనమ్ వా.. మ్యాట్రిక్స్ హీరోయిన్ వా? అన్నంత రేంజులో హొయలు పోయింది. బాండ్ గాళ్ కి ఏమాత్రం తగ్గలేదు. కేన్స్ లో అడుగుపెట్టక ముందే సోనమ్ ఇచ్చిన ట్విస్ట్ చూస్తుంటే.. ఇక అక్కడ అడుగుపెట్టాక భజన పీక్స్ లో ఉండబోతోందని అర్థమవుతోంది.  సోనమ్ డ్రెస్ లన్నిటినీ తన సిస్టర్ రియాకపూర్ డిజైన్ చేస్తుందన్న సంగతి తెలిసిందే. అంతర్జాతీయ డిజైనర్లను స్ఫూర్తిగా తీసుకుని ఈ తరహా డిజైన్లను రియా రూపొందిస్తుంటుంది. ఓ రకంగా కాపీ డిజైన్లు అనుకోవాలేమో!! సోనమ్ కొత్త లుక్ చూసి పంకజాక్షి అంటూ కామెంట్లు రువ్వుతున్నారు బోయ్స్.