పబ్లిక్ లో హాట్ కపుల్ సరసాలేమిటో

Sat Sep 21 2019 23:00:01 GMT+0530 (IST)

Sonam Kapoor And Anand Ahuja At Zoya Factor Special Screening

బాలీవుడ్ కథానాయిక సోనమ్ కపూర్ నటించిన తాజా చిత్రం `జోయా ఫ్యాక్టర్`. దుల్కర్ సల్మాన్ కథానాయకుడు. ఈ శుక్రవారం సినిమా రిలీజై మిశ్రమ స్పందనలు అందుకుంది. తాజాగా ముంబైలో ప్రీమియర్ షోని ప్రత్యేకంగా జుహూలో వున్న ఓ పాపులర్ మల్టీప్లెక్స్ ధియేటర్‌లో ఏర్పాటు చేశారు. బాలీవుడ్ ప్రముఖులతో పాటు ఈ ప్రీమియర్ షోకు సోనమ్ కపూర్ భర్త ఆనంద్ ఆహుజా కూడా హాజరయ్యాడు. షోకు వచ్చిన వాళ్ల చూపులన్నీ ఓ జంటపైనేనట. అక్కడ సోనమ్- ఆనంద్ ఆహుజాల కెమిస్ట్రీకి చూస్తుంటే.. మరీ ఇలా పబ్లిక్ లో ఏమిటీ సరసం? అంటూ కుర్రాళ్లు కామెంట్లు రువ్వుతున్నారు. సరసాలు చాలు శ్రీవారూ.. అనిపించేలా సోనమ్ ఆ ఎక్స్ ప్రెషన్ ఏమిటో చూశారు కదా!ఈ థియేటర్ ప్రాంగణంలో సోనమ్ రెడ్ కలర్ చెక్స్ చుడిదార్ లో మెరిసిపోయింది. ఆనంద్ వైట్ కలర్ షర్ట్.. బ్లాక్ జీన్స్‌లో ఆకట్టుకున్నాడు. స్క్రీనింగ్ కి వచ్చిన వారంతా ఈ జంట చూడముచ్చటగా వుందని గుసగుసలాడుకోవడం కనిపించింది. ఈ సందర్భంగా షో అనంతరం మీడియా ముందుకు వచ్చిన సోనమ్ .. సౌత్ స్టార్లు దుల్కార్- ధనుష్ లపై  ప్రశంసలు కురిపించింది. దక్షిణాది హీరోలతో కలిసి నటించడం మంచి అనుభూతినిస్తోంది. `రాన్జానా`లో ధనుష్ తో కలిసి నటించాను. ఇప్పుడు జోయా ఫ్యాక్టర్ చిత్రంలో దుల్కర్ సల్మాన్ నా లక్కీ ఛామ్.. అని సోనమ్ కపూర్ తెలిపింది. అనుజా చౌహాన్ రచన `జోయా ఫాక్టర్` ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు.

ఈ స్పెషల్ స్క్రీనింగ్ కి కత్రినా కైఫ్- అర్జున్ కపూర్- అభిమన్యు దసాని- అంగద్ బేడీ- స్వరభాస్కర్- విక్కీకౌషల్-తనీషా ముఖర్జీ- మోహిత్ మార్వల్ పాల్గొన్నారు. ఈ షోకి తారల తాకిడి ఎక్కువ కావడంతో అభిమానులు భారీ సంఖ్యలోనే మోహరించారు. దీంతో కత్రినా కైఫ్ ని ఆ క్రౌడ్ నుంచి కాపాడేందుకు అర్జున్ కపూర్ బాడీ గార్డ్ లా ముందుకు రావడం కనిపించింది.