ఫోటో స్టొరీ: దెబ్బకు సమ్మర్ వెనక్కొచ్చేలా ఉంది!

Wed Jul 17 2019 20:09:21 GMT+0530 (IST)

Sonam Kapoor 20 Millions Treat in Social media

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనమ్ కపూర్ కు మొదటి నుంచి ఫ్యాషనిస్టా అనే పేరుంది.  స్టైల్ అనేది ఒంట్లో ఉన్నతర్వాత అది ఎక్కడికి పోదు కదా? బాయ్ ఫ్రెండ్ ఆనంద్ ఆహూజాతో వివాహం అయిన తర్వాత కూడా సోనమ్ స్టైలిష్ ఫోటోషూట్లకు గ్లామర్ ప్రదర్శనలకు ఏమాత్రం అడ్డుకట్ట పడలేదు.  నిజం చెప్పాలంటే మునుపటికంటే ఘాటుగా ఫోటో షూట్లు చేయడం మొదలుపెట్టింది సోనమ్.ఈమధ్య అదే ట్రెండ్ కంటిన్యూ చేస్తూ ఒక కత్తిలాంటి డ్రెస్ ధరించి ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతాలో ఉన్న ఇరవై మిలియన్లకు పైగా ఫాలోయర్లతో పంచుకుంది. ఈ ఫోటోలలో లైట్ గ్రీన్ కలర్ గౌన్ ధరించి అందాల విందు చేస్తూ కెమెరాకు పోజులిచ్చింది. జుట్టును కొప్పుకట్టి.. మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ధరించి ఓ హాలీవుడ్ నటీమణి తరహాలో వగలుపోయింది.  మెడలో ఒక బ్లాక్ స్ట్రాప్ లాంటి యాక్సెసరీ ధరించింది. ఓవరాల్ గా సోనమ్ హాట్ నెస్ తో.. స్టైల్ తో ఎవరూ పోటీ పడలేరని మరోసారి నిరూపించింది.

ఈ ఫోటోలకు లైక్ కొట్టినవారిలో దియా మిర్జాలాంటి బాలీవుడ్ హీరోయిన్లు ఉన్నారు. ఇక సోనమ్ ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ప్రస్తుతం 'ది జోయా ఫ్యాక్టర్' అనే  రొమాంటిక్ డ్రామాలో నటిస్తోంది.  ఈ సినిమాలో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్నాడు.  అభిషేక్ శర్మ ఈ చిత్రానికి దర్శకుడు. సెప్టెంబర్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.