అమ్మాయిలపై సోనాలి హాట్ కామెంట్స్..!

Sat Mar 18 2023 05:00:02 GMT+0530 (India Standard Time)

Sonali's hot comments on girls..!

సీరియల్స్ తో పాటుగా సినిమాల్లో నటిస్తూ తన ప్రతిభ చాటి.. తమిళ హిందీ మరాఠి ఇంగ్లీష్ కొరియన్ ఇటాలియన్ భాషల్లో 70కి పైగా సినిమాల్లో నటించిన సోనాలి కులకర్ణి దేశంలో అమ్మాయిలు సోమరితనం తో ఉన్నారని చెప్పుకొచ్చారు. మహిళలపై నటి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బాలీవుడ్ లో కోచ్ బి.ఎస్.ఆర్ యూట్యూబ్ ఛానెల్ లో భూపేంద్ర సింగ్ రాథోడ్ తో కలిసి సోనాలి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ చిట్ చాట్ లో పురుషులు 18 ఏళ్లు రాగానే ఫ్యామిలీని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేందుకు వారిపై ఒత్తిడి ఏర్పడుతుందని.. అయితే అమ్మాయిలు పాతికేళ్లు వచ్చినా వారి బాయ్ ఫ్రెండ్ పై ఆధార పడుతున్నారు.. వారికి కావాల్సినవి తెచ్చి పెట్టమని బలవంతం చేస్తున్నారని అన్నారు. పెళ్లి విషయంలో కూడా అమ్మాయికి ఇల్లు ఉందా.. శాలరీ 50 వేలు వస్తున్నాయా అని చూస్తున్నారు. అసలు అమ్మాయిలకు ఏం కావాలి మంచి అబ్బాయిలా లేదా మంచి ఆఫర్లా అని ఆమె అన్నారు.

అమ్మాయి అయినా సరే అమ్మాయి కష్ట సుఖాలని ఇద్దరు సమానంగా పంచుకోవాలి.. అయితే అమ్మాయిలు ఇవన్ని వదిలేసి మానవ హక్కుల దగ్గరకు వెళ్తున్నారని అన్నారు. ఒక మహిళ అయ్యుండి ఆమె చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు పాజిటివ్ కామెంట్స్ చేస్తుండగా మరికొంతమంది వ్యతిరేకిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. సోనాలి చేసిన కామెంట్స్ లో నిజం లేకపోలేదు. మహిళలు తమ శక్తిని తామే తగ్గించుకొని తమని తాము ఒక బందీగా ఉంటున్నారు. కానీ వారు ఒక్కసారి ఆలోచిస్తే వారి వల్ల కాని పని అంటూ ఏది లేదు.

ఈ విషయాన్నే సోనాలి కాస్త ఓపెన్ గా చెప్పారు. సోనాలి కామెంట్స్ పై ఎలాంటి రెస్పాన్స్ వచ్చినా సరే ఇలా మాట్లాడగలగడం మాత్రం ఆమె వల్లే అవుతుంది. మహిళలు ఎప్పుడు డిపెండెంట్ కావొద్దని బలంగా వినిపించే వారిలో ఆమె ఒకరు. ప్రస్తుతం సోనాలి చేసిన కామెంట్స్ పై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.