Begin typing your search above and press return to search.

మెగాస్టార్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?

By:  Tupaki Desk   |   23 Jun 2021 2:30 PM GMT
మెగాస్టార్ కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ..?
X
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం లైన్ లో పెట్టిన సినిమాలలో డైరెక్టర్‌ బాబీ (కె.ఎస్‌. రవీంద్ర) ప్రాజెక్ట్ ఒకటి. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ సినిమాలో చిరు సరసన నటించబోయే హీరోయిన్ గురించి ఓ గాసిప్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఇందులో ఫీమేల్ లీడ్ కోసం బాలీవుడ్ బ్యూటీ సోనాక్షి సిన్హా ను సంప్రదింపులు జరుపుతున్నారట.

సోనాక్షి సిన్హా నుంచి పాజిటివ్ రెస్పాన్స్ కూడా వచ్చిందని.. దీని కోసం ఆమెకు మంచి రెమ్యూనరేషన్ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది. రజినీకాంత్ హీరోగా నటించిన 'లింగా' సినిమాతో సోనాక్షి సౌత్ లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో ఇప్పుడు మెగాస్టార్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనుందని అంటున్నారు. ఇందులో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

కాగా, 'పవర్' 'జైలవకుశ' 'వెంకీమామ' వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు డైరెక్ట్ చేసిన బాబీ.. చిరంజీవి కి చెప్పిన స్టోరీ లైన్ నచ్చడంతో వెంటనే ఓకే చేసాడని తెలుస్తోంది. ఇదొక ఎమోషన్‌ తో కూడిన ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ అని టాక్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్స్ జరుగుతున్నాయి. ప్రస్తుతం 'ఆచార్య' లో నటిస్తున్న చిరు.. 'లూసిఫర్' రీమేక్ మరియు 'వేదళమ్' రీమేక్ చిత్రాలలో నటించనున్నాడు. ఈ క్రమంలో బాబీ సినిమాని ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.