ఆల్కహాలిక్ మరియు వర్క్ హాలిక్.. బాలయ్య మామూలోడు కాదు

Mon Jan 23 2023 14:33:12 GMT+0530 (India Standard Time)

Some of Balakrishna's comments are going viral on social media

నందమూరి బాలకృష్ణ 2021 లో అఖండ సినిమాతో విజయాన్ని సొంతం చేసుకున్నాడు. 2022 లో బాలయ్య సినిమాలు విడుదల కాలేదు. ఈ ఏడాది ఆరంభంలోనే సంక్రాంతి కానుకగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రాక్ దర్శకుడు గోపీచంద్ మలినేని తో మైత్రి మూవీ మేకర్స్ వారు బాలయ్య హీరోగా ఈ సినిమాను నిర్మించారు.చాలా రోజుల గ్యాప్ తర్వాత ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అభిమానులకు తన మార్క్ సినిమాను అందించాడు. సమర సింహారెడ్డి సినిమా రేంజ్ మూవీ చేయాలని బాలయ్య మరియు గోపీచంద్ మలినేని అనుకున్నారట. ఆ స్థాయి సినిమా ఇది అన్నట్లుగా మైత్రి మూవీ మేకర్స్ వారు పేర్కొన్నారు.

తాజాగా సినిమా యొక్క విజయోత్సవ వేడుకను హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా పాల్గొని సందడి చేశారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సినిమా కోసం వర్క్ చేసిన మనం అందరం ఆల్కహాలిక్ అంటూ నిర్మొహమాటంగా చెప్పేశాడు. అంతే కాకుండా వర్క్ హాలిక్ అన్నట్లుగా కూడా పేర్కొన్నాడు.

ఆల్కహాలిక్ మరియు వర్క్ హాలిక్ అవ్వడం వల్లే ఇంత మంచి సినిమా వచ్చిందని బాలయ్య పేర్కొన్నాడు.

ఇక తన సినిమాలోని డైలాగ్స్ ఇంత పవర్ ఫుల్ గా చెప్పడానికి కారణం ప్రతి రోజు ఉదయాన్నే మూడు గంటలకు చుట్ట తాగుతాను అని.. దాని తో ఆరోగ్యం బాగుండటంతో పాటు గొంతు కూడా బాగుంటుందని బాలయ్య పేర్కొన్నాడు. సినిమా విజయోత్సవ వేడుకలో బాలయ్య పాట పాడి అభిమానులను అలరించాడు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.