`సోగ్గాడి కాపురం` నిర్మాత సి.శ్రీధర్ రెడ్డి మృతి

Mon May 10 2021 07:00:01 GMT+0530 (IST)

Soggadi Kapuram producer C Sridhar Reddy dies

శోభన్ బాబు - జయసుధ జంటగా `సోగ్గాడి కాపురం` .. సుమాన్ - సౌందర్య జంటగా `బాలరాజు బంగారు పెళ్లాం`.. వంటి చిత్రాల్ని నిర్మించిన ప్రముఖ నిర్మాత సి.శ్రీధర్ అనారోగ్యంతో మృతి చెందారు. శనివారం రాత్రి ఆయన కాలం చేశారని ఏపీ ఫిలింఛాంబర్ సభ్యులు వెల్లడించారు.ఆయన పుట్టిన ఊరు నెల్లూరు. సినిమా ఇండస్ట్రీపై ఉన్న మక్కువతో చెన్నై వెళ్లారు. నిర్మాతగా కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో శోభన్ బాబు- జయసుధతో `సోగ్గాడి కాపురం`.. వై. నాగేశ్వరావు దర్శకత్వంలో సుమన్- సౌందర్య హీరో హీరోయిన్లుగా `బాలరాజు బంగారు పెళ్ళాం` సినిమాలను నిర్మించారు. ఆయన గొప్ప సహృదయులు. ఆయన లేని లోటు తీరనిదని ఆయన ఆత్మకు శాంతి కలగాలని కుటుంబానికి తెలుగు చిత్రసీమ ప్రముఖులు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. తెలుగు నిర్మాతల మండలి వారి కుటుంబీకులకు సానుభూతిని వ్యక్తం చేసింది.

సెకండ్ వేవ్ మహమ్మారీ ఇప్పటికే పలువురు సెలబ్రిటీల అకాలమరణానికి కారణమైంది. ఓ ఇరువురు యువదర్శకులు కరోనాతో ఇటీవల మరణించారు. ఇప్పుడు నిర్మాత శ్రీధర్ కరోనాకు చికిత్స పొందుతూ మృతి చెందారని సమాచారం అందడంతో పరిశ్రమలో విషాదం నెలకొంది.