అగ్ర కథానాయకుల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ `వీర సింహారెడ్డి`. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ మూవీ సంక్రాంతి బరిలో నిలిచింది. భారీ బ్లాక్బస్టర్ అనిపించుకోలేదు కానీ యావరేజ్ హిట్ అనిపించుకుంది. వసూళ్ల పరంగానూ సినిమాకు మంచి టాక్ రావడం ఊహించిన ఫిగర్లని నమోదు చేసుకోవడంతో చిత్ర బృందం ఖుషీ అయింది. ఈ నేపథ్యంలోనే ఇటీవల విజయోత్సవంని హైదరాబాద్ లో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇదే ఈవెంట్ ఇప్పుడు బాలయ్య వార్తల్లో నిలిచేలా చేసింది. ఈ ఈవెంట్ సాక్షిగా బాలయ్య ఈ రంగారావు.. ఆ రంగారావు .. అక్కినేని.. తొక్కినేని `అంటూ చేసిన వ్యాఖ్యలు పెను వివాదానిక దారి తీస్తున్నాయి. నెట్టింట ఈ వివాదంపై అక్కినేని అభిమానులు తీవ్ర స్థాయిలో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తూ ట్రోల్ చేస్తున్నారు. అంతే కాకుండా ఆలిండియా అక్కినేని అభిమాన సంఘం బాలయ్య చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
వెంటనే తన వ్యాఖ్యలకు బాలకృష్ణ అక్కినేని కుటుంబానికి క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆల్టమేటమ్ జారీ చేసింది. కెరీర్ లో బాలయ్య పడిలేచిన ప్రతీసారి ఏదో ఒక వివాదంలో చిక్కుకోవడం పరి పాటిగా మారింది. సమరసింహారెడ్డి నరసింహ నాయుడు వంటి ఫ్యాక్షన్ సినిమాలతో తిరుగులేని ఇమేజ్ని దక్కించుకున్న బాలకృష్ణ ఆ తరువాత నుంచి డౌన్ ఫాల్ కావడం మొదలు పెట్టాడు. ఇక `పల్నాటి బ్రహ్మనాయుడు` సినిమాలో తొడ కొడితే ట్రైన్ ఆగడం వెనక్కి వెళ్లడం వంటివి ప్రేక్షకుల్లో నవ్వుల పాలు చేశాయి.
ఇప్పటికీ ఆ సీన్ లని నెట్టింట యూత్ ట్రోల్ చేస్తూ కామెంట్ లు పెడుతూనే వున్నారు. ఇక `లక్ష్మీనరసింహ`తో బాలయ్య కెరీర్ గాడిన పడిందిలే అనుకునే లోపే ఇంట్లో కాల్పుల కలకలం రాష్ట్రా వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీని నుంచిబయటపడటానికి చంద్రబాబు నాయుడు రంగంలోకి దిగి అప్పటి నిమ్స్ డైరెక్టర్ కాకర్లని ప్రయోగించాల్సి వచ్చిందని ఇప్పటికి చెప్పుకుంటుంటారు. ఆ సంఘటన తరువాత బాలయ్య కెరీర్ మరింత పతనావస్థకు చేరింది.
`విజయేంద్ర వర్మ` అల్లరి పడుగు వంటి సినిమాలు మరింత కామెడీ అయ్యాయి. వీరభద్ర మహారథి ఒక్క మగాడు సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇందులో వైవీఎస్ చౌదరి `భారతీయుడు` సినిమాని పక్కగా లేపేసి `ఒక్క మగాడు` అంటూ తెరపైకి తీసుకొచ్చి బాలయ్యని మరింత ట్రోలింగ్ కి గురయ్యేలా చేశాడు. సినిమా పరిస్థితి ఇలా మారడంతో బాలయ్యకు ట్రబుల్ షూటర్ గా దొరికాడు బోయపాటి శ్రీను. తను తీసిన `సింహ`తో బాలయ్య కెరీర్ మళ్లీ గాడిన పడింది. అక్కడి నుంచి బాలయ్య పడిన ప్రతీసారి బోయపాటి లేపుతూ వచ్చాడు.
సినిమాల పరిస్థితి ఇలా వుంటే బాలయ్య పబ్లిక్ మీటింగ్ లలో మాట్లాడిన తీరు మరింతగా ట్రోలింగ్ కు గురయ్యేలా చేసింది. తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచారంలో బాలయ్య `సరే జహాసే అచ్చా..` పలకడానికి పడిన ఆపసోపాలు నెట్టింట వైరల్ కావడంతో మరింతగా కామెడీ అయ్యారు. `అఖండ`తో మళ్లీ గాడిలో పడిన బాలయ్య అన్స్టాపబుల్ తో మరింతగా పాపులర్ అయ్యారు.
అయితే ఆ సక్సెస్ ని పాపులారిటీని తాజా వివాదంతో మళ్లీ బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తున్నారు. బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడమే కాకుండా హీరోయిన్ హనీ రోజ్ లో పబ్లిక్ గా మద్యం తాగుతూ పోజులివ్వడం కూడా వివాదంగా మారింది. ఇది చూసిన వారంతా బాలయ్య ఏంటయ్యా ఈ గోల అని ముక్కున వేలేసుకుంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.