నాగ చైతన్య లండన్ బర్త్ డే వేడుకల్లో శోభిత?

Mon Nov 28 2022 17:00:01 GMT+0530 (India Standard Time)

Sobhita at NagaChaitanya Bday Celebrations in London!

నాగచైతన్య-శోభిత ధూళిపాళ మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అంటూ నేషనల్ మీడియా లో కొన్ని నెలలుగా కథనాలు వైరల్ అవుతోన్న సంగతి  తెలిసిందే. సమంతతో  విడాకుల తర్వాత చై శోభితకు దగ్గరవుతున్నట్లు..ఇద్దరు మధ్య బాండింగ్ స్టార్ట్ అవుతున్నట్లు మీడియా కథనాలు అంత కంతకు వేడి పెంచుతున్నాయి.వీటికి తగ్గట్టు ఇటీవలే ఇద్దరు జంటగా కలిసి దిగిన ఫోటో కూడా నెట్టింట పెద్ద దుమారమే రేపాయి. కలిసి సినిమాలు చేయలేదు. అలాగని  ఇద్దరు స్నేహితులు కాదు.

మరి ఈ బాండింగ్ ఎలా సాధ్యమంటూ చాలా సందేహాలే వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా గత మూడు నాలుగు రోజులు గా ఇద్దరు విదేశాల్లో దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియా లో పెద్ద చిచ్చే రేపింది. తాజాగా దానికి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. నవంబర్ 23న చైతన్య బర్త్ డే  సందర్భంగా ఆ వేడుకల్ని లండన్ లో సెలబ్రేట్ చేసుకున్నారు.

ఆయన కేవలం ఆ వేడుకలు కోసమే లండన్ వెళ్లినట్లు వాత్తలొచ్చాయి. అయితే అప్పుడాయన సింగిల్ గా వెళ్లాడనుకున్నారంతా? ఈ ఫోటో చూస్తుంటే ఇద్దరు కలిసి లండన్ వెళ్ళారా అని ఎవరు ఊహకు వాళ్ళు ఊహించుకుంటున్నారు .  వేర్వేరు సోర్సెస్ ద్వారా నెట్లో వైరల్ అయ్యాయి.

దీంతో చైతోపాటు వేడుకల్లో శోభిత కూడా పాల్గొన్నట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు పుట్టుకొని వచ్చాయి . కేవలం ఇద్దరు  జంటగా పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడానికి లండన్ వెళ్లినట్లు ఓ వార్త బయటకు వచ్చింది.  ఇవి పాత ఫోటోలు కావు.. తాజా ఫోటోలేనని మరి కొంత మంది అంటున్నారు.

దీంతో మీడియా కథనాలకు మరింత బలం తోడైంది. ఇద్దరి మధ్య స్నేహాన్ని మించిన బాండింగ్ లేకపోతే  ఇలాంటివి ఎలా సాధ్యమంటూ సందేహిస్తున్నారు. మరి ఇప్పటికైనా ఈ జంట నోరు విప్పుతుందేమో చూడాలి. శోభిత తెలుగు అమ్మాయేనన్న సంగతి తెలిసిందే.నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.