పెళ్లి ఎప్పుడో చెప్పేసిన బుల్లి తెర ఆటంబాంబ్

Sun Feb 28 2021 12:39:09 GMT+0530 (IST)

Small screen atom bomb that ever said wedding

తెలుగు బుల్లి తెరపై సుమ తర్వాత అంతటి ఎనర్జిని సమయస్ఫూర్తిని చూపించే యాంకర్ ఎవరు అంటే అందరు ఠక్కున చెప్పే పేర్లలో శ్రీముఖి ముందు ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఆమె హై ఓల్టేజ్ ఎనర్జీ అందరికి ఆదర్శం అనడంలో సందేహం లేదు. అద్బుతమైన వాక్చాతుర్యంతో పాటు మంచి ఫిజిక్ మరియు ఆకట్టుకునే రూపం ఉండటం తో యాంకర్ గానే కాకుండా వెండి తెరపై కూడా శ్రీముఖికి ఆఫర్లు వస్తున్నాయి. తన ఎక్కువ దృష్టి బుల్లి తెరపైనే పెట్టే శ్రీముఖి పెళ్లి విషయమై ఇటీవల ఒక టాక్ షో లో క్లారిటీ ఇచ్చేసింది. ఆమె మాటల ప్రకారం పెళ్లి ఇప్పట్లో కాదని తేలిపోయింది. అలాగే తానేం ప్రస్తుతం రిలేషన్ లో లేను అంటూ చెప్పేసింది.ప్రస్తుతం తన కెరీర్ పరంగా తాను చాలా సంతోషంగా ఉన్నాను. మరో మూడు నాలుగు సంవత్సరాల వరకు పెళ్లి విషయమై తాను ఆలోచించాలని భావించడం లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది. పెళ్లి విషయమై తాను ఇప్పటికే క్లారిటీతో ఉన్నాను. 31 లో పడ్డ తర్వాత పెళ్లి చేసుకుంటాను అంటూ చెప్పిన శ్రీముఖి తాను పెళ్లి చేసుకోబోతున్న వాడు యాక్టివ్ గా ఎనర్జిటిక్ గా ఉండాలి. నన్ను ఎక్కువగా గారాబం చేస్తూ ఉండటంతో పాటు నాకు ఫ్రీ స్పేస్ ను కల్పించాలంటూ పేర్కొంది. 2025 వరకు శ్రీముఖి పెళ్లి గురించి ఇక మీడియాలో వార్తలు ఉండకపోవచ్చు.