సూపర్ స్టార్ కోసం పూణే రీ క్రియేట్

Tue Aug 04 2020 05:00:03 GMT+0530 (IST)

Pune re creation for superstar

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ ఏడాది మొత్తం కూడా తాను షూటింగ్ కు హాజరు అయ్యేది లేదు అంటూ తేల్చి చెప్పాడు. కరోనా విజృంభిస్తున్న ఈ సమయంలో రజినీకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. కరోనాకు వ్యాక్సిన్ వచ్చి పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాతే షూటింగ్ కు వెళ్లలని కుటుంబ సభ్యుల సూచన ప్రకారం తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆమద్య ఒక సందర్బంగా రజినీకాంత్ చెప్పాడు. రజినీకాంత్ లేకుండానే ఆయన సినిమాను పున: ప్రారంభించేందుకు దర్శకుడు శివ ఏర్పాట్లు చేస్తున్నాడు.రజినీకాంత్ తో శివ తెరకెక్కిస్తున్న సినిమా దాదాపుగా సగం పూర్తి అయ్యింది. ఈ సమయంలో కరోనా కారణంగా సినిమా నిలిచి పోయింది. రజినీకాంత్ వచ్చే ఏడాది వరకు సెట్స్ రానంటూ తేల్చి చెప్పడంతో ఈ గ్యాప్ లో ఆయన కాంబినేషన్ లేని సీన్స్ ను పూర్తి చేయాలని శివ నిర్ణయించుకున్నాడు. అందుకోసం కోటిన్నరతో చెన్నైలోని ఒక ప్రముఖ స్టూడియోలో పూణే సెట్టింగ్ ను వేయిస్తున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ నుండి దాదాపు నెల రోజుల పాటు శివ ఆ సెట్స్ లో షూటింగ్ చేస్తాడు.

రజినీకాంత్ వచ్చిన తర్వాత ఆయన కాంబో సీన్స్ స్పీడ్ గా పూర్తి చేసి సినిమాను వెంటనే విడుదల చేసే అవకాశం ఉందని శివ భావిస్తున్నాడట. ఇందుకు రజినీకాంత్ కూడా ఓకే చెప్పడంతో శివ స్పీడ్ గా ఆ సన్నాహాల్లో ఉన్నాడట. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. వచ్చే ఏడాది సమ్మర్ వరకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.