సీతారామం బ్యూటీ వడకట్టి మరి పట్టుకుంటుందా..!

Sat Apr 01 2023 17:00:01 GMT+0530 (India Standard Time)

Mrunal Thakur Fixed To Do Films Where His Role Is Important

బాలీవుడ్ లో హృతిక్ రోషన్ తో నటించిన మృణాల్ ఠాకూర్ తెలుగులో సీతారామం తో సూపర్ పాపులర్ అయ్యింది. సినిమాలో సీతామహాలక్ష్మి అలియాస్ నూర్జహాన్ పాత్రలో ఆమె కనబరచిన అభినయం తెలుగు ప్రేక్షక హృదయాలను గెలిచేసింది. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇన్నాళ్లు ఎక్కడ ఉన్నావ్ అన్నట్టుగా ఆమెను పొగిడేశారు.ఒక్క సినిమాతో క్రేజ్ తెచ్చుకునే భామలు చాలా తక్కువ మంది ఉంటారు. ఆ లిస్ట్ లో ఇప్పుడు మృణాల్ కూడా చేరిపోయింది. సీతారామం హిట్ తో ఆమెకు అరడజనుకు పైగా ఆఫర్లు వచ్చాయట. ఆఫర్లు వచ్చాయి కదా అని ఓకే చేయకుండా తన పాత్ర ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తానని అంటుందట.

ఇప్పటికే నాని 30వ సినిమాలో హీరోయిన్ గా ఫిక్స్ అయిన మృణాల్ ఆ సినిమాలో తన రోల్ తో మరోసారి మెప్పించాలని చూస్తుంది. ఇక మరోపక్క పెద్ద సంస్థల నుంచి ఒకటి రెండు అవకాశాలు వచ్చాయట.

కథల విషయంలో మృణాల్ మరీ వడ కట్టినట్టు ఉంటుందని టాక్. ఈమధ్య ఒక స్టార్ హీరో సినిమా ఛాన్స్ వస్తే ఆమె తన రోల్ అంతగా లేదని వద్దనేసిందట. అన్ని సినిమాల్లో ఇంపార్టెంట్ రోల్స్ రావాలంటే చాలా కష్టం. తనకు వచ్చే కొంత స్పేస్ లోనే ఆమె తన టాలెంట్ చూపించాల్సి ఉంటుంది.

మృణాల్ చేస్తుంది కరెక్టా కాదా అన్నది పక్కన పెడితే ఒక్కొక్కరు ఒక్కోలా తమ కెరీర్ ని కొనసాగించాలని అనుకుంటారు. బాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశాన్ని చేస్తున్న మృణాల్ తెలుగులోనే ఇలా స్పెషల్ కేర్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది.

నాని సినిమా కూడా హిట్ పడితే మాత్రం అమ్మడికి ఇక తెలుగులో తిరుగు ఉండదని చెప్పొచ్చు. స్టార్ సినిమాల్లో అవకాశాలు కాదంటే మాత్రం కెరీర్ రిస్క్ లో పడే ఛాన్స్ ఉన్నట్టే. మరి మృణాల్ తన ఆలోచన మార్చుకుంటుందా లేదా అన్నది చూడాలి.

సీతారామం తనకు తెలుగులోనే కాదు తను ఆల్రెడీ హీరోయిన్ గా చేస్తున్న బాలీవుడ్ లో కూడా ఆమెకు మంచి ఇమేజ్ తెచ్చింది. అక్కడ కూడా వరుస సినిమాలతో సత్తా చాటుతుంది మృణాల్ ఠాకూర్.