అప్పుడే డబ్బులు సంపాదిస్తున్న సితార

Fri May 26 2023 11:14:37 GMT+0530 (India Standard Time)

Sitara has signed on as a brand ambassador

సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సోషల్ మీడియాలో సితార కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఇన్ స్టా గ్రామ్.. యూట్యూబ్ మరియు ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై సితార పాప చేసిన సందడి అంతా ఇంతా కాదు.



ఆ మధ్య ఒక లిరికల్ వీడియోలో కనిపించిన సితార కొన్నాళ్ల క్రితం మహేష్ బాబు మరియు నమ్రత నటించిన ఒక కమర్షియల్ యాడ్ లో కనిపించిన విషయం తెల్సిందే. ఇప్పుడు సొంతంగా సితార ఒక ప్రముఖ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. మహేష్ బాబు బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నో కంపెనీల ను ప్రమోట్ చేస్తున్న విషయం తెల్సిందే.

ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ కి సితార బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేందుకు గాను సైన్ చేసింది. అంతే కాకుండా ఇటీవల మూడు రోజుల పాటు ఒక రహస్య ప్రాంతంలో సదరు యాడ్ కు సంబంధించిన షూటింగ్ లో కూడా సితార పాల్గొన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

ప్రముఖ యాడ్ ఫిల్మ్ మేకర్స్ మరియు అత్యున్నత టెక్నీషియన్స్ ఈ యాడ్ ని రూపొందించినట్లుగా సమాచారం అందుతోంది. సితార చిన్న వయసులోనే డబ్బు సంపాదించడం మొదలు పెట్టింది. ఇప్పటికే యూట్యూబ్ ద్వారా మరియు ఇన్ స్టా ద్వారా డబ్బు సంపాదిస్తున్న సితార ఇప్పుడు నెక్ట్స్ లెవల్ అన్నట్లుగా బ్రాండ్ అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తూ డబ్బు సంపాదిస్తోంది. ముందు ముందు నటి గా సితార మరింత గా సంపాదించాలని కోరుకుందాం.