Begin typing your search above and press return to search.

సితార.. మరో న్యూ ఎంట్రీ

By:  Tupaki Desk   |   28 May 2023 12:00 PM GMT
సితార.. మరో న్యూ ఎంట్రీ
X
సూపర్ స్టార్ మహేష్ బాబు పిల్లలకి కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. సినిమా షూటింగ్ లు లేకపోతే ఎక్కువ సమయం మహేష్ బాబు పిల్లలతోనే స్పెండ్ చేస్తారు అనే సంగతి తెలిసిందే. ఇప్పటికే మహేష్ తనయుడు గౌతమ్ కృష్ణ వన్(నేనొక్కడినే) మూవీతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం స్టడీస్ లో ఉన్నాడు. ఇదిలా ఉంటే మహేష్ బాబు కూతురు సితార ఘట్టమనేని ఇప్పటికే వండర్ కిడ్ అనిపించుకుంటుంది.

తనలోని హిడెన్ టాలెంట్స్ అన్ని బయటపెడుతోంది. సర్కారువారిపాట సినిమా ప్రమోషన్ సాంగ్ లో కూడా సితార తన డాన్స్ టాలెంట్ చూపించింది. ఇక సింగింగ్ టాలెంట్ కూడా అప్పుడప్పుడు ప్రదర్శిస్తూ ఉంటుంది. ఇక ఆ మధ్య సుకుమార్ కూతురుతో కలిసి ఒక యుట్యూబ్ ఛానల్ స్టార్ చేసి ఇంటరెస్టింగ్ వీడియోలు చేస్తూ ఉండేవారు.

ఇప్పుడు సితారా పేరు మీదనే మరో యుట్యూబ్ ఛానల్ ని లాంచ్ చేసింది. ఇందులో మొదటి వీడియోగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో కలిసి దుబాయ్ ట్రిప్ కి వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ ట్రిప్ లోనే అన్ని మూమెంట్స్ ని కలిపి షార్ట్ వీడియోగా చేసి షేర్ చేసింది. ఇప్పుడు ఇక షార్ట్ వీడియోని షేర్ చేస్తూ జాయిన్ హెర్ ఎగ్జైటింగ్ జర్నీ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ అంటూ కామెంట్ చేసింది.

ఇక ఈ షార్ట్ వీడియోకి దుబాయ్ అన్ ఫిల్టర్ద్ మై విజువల్ లవ్ లెటర్ అంటూ సితార ఘట్టమనేని పేరు పెట్టడం విశేషం. దీనిని బట్టి ఆమె దుబాయ్ లోని తన ఫన్ అండ్ జోష్ మూడ్ ని వీడియోలో ఎస్టాబ్లిష్ చేసింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. మొత్తానికి సితార పెట్టె ఈ యుట్యూబ్ ఛానల్ లో ఇకపై ఎలాంటి వీడియోలు చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది

ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే దుబాయ్ ట్రిప్ ముగించుకొని ఇండియా తిరిగి వచ్చేశారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కోసం మహేష్ రెడీ అవుతున్నారు. అలాగే తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ జయంతి వేడుకలకి ఫ్యాన్స్ కి తన కొత్త సినిమా నుంచి సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యారు.