వారి బ్రేకప్ పై తొలిసారి స్పందించిన సిరి

Sun Jan 16 2022 11:43:55 GMT+0530 (IST)

Siri About Shannu Break Up

గత బిగ్ బాస్ లకు భిన్నంగా సాగింది బిస్ బాస్-5. గత సీజన్లకు భిన్నంగా ఈ సీజన్ లో రొమాన్సు పాళ్లుఎక్కువ కావటం.. అదంతా షణ్నూ- సిరిల పుణ్యమేనని చెప్పాలి. వీరిద్దరికి హౌస్ బయట రిలేషన్లు ఉండటం.. ఇద్దరు వేరే వారితో కమిట్అయినోళ్లే కావటం.. క్లోజ్ ఫ్రెండ్స్ అన్న ట్యాగ్ నుంచి.. అతిగా హగ్గులు.. కిస్సులతో ఈ షోను చూసే ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టటం తెలిసిందే. క్షణం విడిచి ఉండేందుకు ఇష్టపడని ఈ ఇద్దరూ షో అయ్యాక.. ఎవరిదారిన వారు ఉండటం తెలిసిందే.ఈ షో పుణ్యమా అని.. సిరి భారీ నెగిటివిటీని మూటగట్టుకోగా.. షణ్నూ సైతం బ్యాడ్ అయ్యాడు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. షణ్నూతో తనకున్న లాంగ్ రిలేషన్ కు గుడ్ బై చెబుతూ.. తన బ్రేకప్ ను సోషల్ మీడియాలో దీప్తి సునైనా ప్రకటించటం.. దానిపై షణ్నూ రియాక్టు కావటం తెలిసిందే. బిగ్ బాస్ 5 షో జరుగుతున్నప్పుడు.. ఎలా అయితే షణ్నూ.. సిరిలు వార్తల్లో నలిగారో.. షో అయ్యాక కూడా వారు వార్తల్లోనే ఉంటున్నారు.

షణ్నూ-దీప్తి బ్రేకప్ పాపం మొత్తం సిరి అకౌంట్లో పడేసి.. దుమ్ము దులిపేస్తున్నారు నెటిజన్లు. ఆమె అతి దీనంతటికి కారణమని నిందిస్తున్న వారు.. షణ్నూ చేసిన ఓవరాక్షన్ మీద మాత్రం పెద్దగా రియాక్టు కాకపోవటం గమనార్హం. దీప్తి బ్రేకప్ చెప్పిన నాటి నుంచి షణ్నూకు బ్యాడ్ టైం మొదలైంది. హౌస్ లో ఓవరాక్షన్ చేసిన దానికి అనుభవించాలని తిట్టిపోసే వారుంటే.. దీప్తి మాత్రం బిగ్ బాస్ సీజన్ లో క్లోజ్ గా మూవ్ కావటం మర్చిపోయారా? అంటూ కౌంటర్లు ఇచ్చేవారు లేకపోలేదు.

ఇదిలా ఉండగా.. తాజాగా షణ్నూ-దీప్తి బ్రేకప్‌పై తొలిసారి రియాక్టు అయ్యింది సిరి. షణ్నూతో తనకు ఉన్నది స్నేహం మాత్రమేనని.. కాకుంటే హౌస్ లో కాస్తంత ఎక్కువగా ఎమోషన్ అయ్యామని పేర్కొంది. తనకు షణ్ముఖ్.. జెస్సీలు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ అని.. తమ మధ్య ఉన్నది కేవలం స్నేహం మాత్రమేనని చెప్పుకొచ్చింది. దీప్తితో కూడాతనకు పరిచయం ఉందని.. ఇద్దరం కలిసి పని చేసినట్లుగా సిరి వెల్లడించింది.

కాకుంటే..  బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. తనపై జరిగిన ట్రోలింగ్ చూసిన తర్వాత తాను డిప్రెషన్ లోకి వెళ్లినట్లుగా చెప్పిన సిరి.. ‘‘దీప్తి బ్రేక్ అని చెప్పటంతో నా మీద మళ్లీ నెగిటివిటీ పెరిగింది. నా వల్ల బ్రేకప్ జరిగేంత బలహీనమైన ప్రేమ కాదు వాళ్లది. నా వల్లే అంటే ఆ బ్రేకప్ ఎప్పుడో జరిగేది.ఒక్క బిగ్ బాస్ వల్ల.. నా వల్ల బ్రేకప్ జరగలేదు’’ అంటూ తన వాదనను వినిపించింది. మరి.. దీనికి దీప్తి ఎలా రియాక్టు అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది.