ధనుష్ కెరియర్లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా సార్

Sat Mar 18 2023 12:22:39 GMT+0530 (India Standard Time)

Sir, it is the highest collection movie in Dhanush's career

ధనుష్ హీరోగా నటించిన తాజా చిత్రం సార్. తమిళంలో వాతి పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను తెలుగులో సార్ పేరుతో రిలీజ్ చేశారు. ఈ సినిమా విడుదలై నాలుగు వారాల పూర్తి కాగా... డిజిటల్ రిలీజ్ కూడా అయింది. మార్చి 17వ తేదీ నుంచి ఈ సినిమా నెట్ ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే థియేటర్లలో ఉన్న ఈ సినిమా వసూళ్లలో భారీ డ్రాప్ కనిపించింది.
 
మొత్తం మీద ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయం మీద పరిశీలిస్తే ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో 27వ రోజున దాదాపు 15 లక్షల రేంజ్ లో షేర్ అందుకుంది. 28వ రోజు మాత్రం 11 లక్షల షేర్ మాత్రమే అందుకుంది.
 
ఇక ఈ సినిమా నాలుగు వారాలకు గాను తెలుగు రాష్ట్రాల్లో అందుకున్న కలెక్షన్స్ మీద ఒకసారి కన్నేస్తే నైజాం ప్రాంతంలో ఎనిమిది కోట్ల 93 లక్షలు సీడెడ్ ప్రాంతంలో మూడు కోట్ల 15 లక్షలు ఉత్తరాంధ్ర ప్రాంతంలో మూడు కోట్ల 34 లక్షలు ఈస్ట్ గోదావరి ప్రాంతంలో రెండు కోట్ల నాలుగు లక్షలు వెస్ట్ గోదావరి ప్రాంతంలో 93 లక్షలు గుంటూరు ప్రాంతంలో కోటి 63 లక్షలు కృష్ణాజిల్లాలో కోటి 49 లక్షలు నెల్లూరులో 81 లక్షలు రాబట్టింది.ఇక ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ మొత్తం మీద 22 కోట్ల 32 లక్షల షేర్ 42 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. కర్ణాటక సహా మిగతా భారతదేశం మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా కోటి 40 లక్షలు వసూలు చేసి ప్రపంచవ్యాప్తంగా 23 లక్షల 72 కోట్ల షేర్ 45 కోట్ల 15 లక్షల గ్రాస్ వసూలు చేసింది. తమిళ వర్షన్ కూడా కలుపుకుంటే 118 కోట్ల 37 లక్షల గ్రాస్ 61 కోట్ల 71 లక్షల షేర్ వసూళ్లు సాధించింది. మొత్తానికి కొద్ది రోజులకే లాభాల బాట పట్టిన ఈ సినిమా ధనుష్ కెరియర్ లోనే అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాగా నిలిచింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.