ఆత్మన్ కోసం శింబు సరికొత్తగా లుక్

Sat Mar 18 2023 18:42:30 GMT+0530 (India Standard Time)

Simbu New Look For Atman

కోలీవుడ్ లో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటుడు శింబు. గత ఏడాది గౌతమ్ మీనన్ దర్శకత్వంలో శింబు వెందు తానింధదు కాడు మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది.ఆ సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్ లో శింబు కనిపించి మెప్పించాడు. మానాడు తర్వాత వెందు తానింధదు కాడుతో మరో హిట్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ఆ మూవీ తర్వాత గ్యాప్ తీసుకున్న శింబు ఫిజికల్ చేంజ్ అయిపోయి ఏకంగా 105 కేజీలకి పెరిగిపోయాడు.

పొట్ట కూడా వచ్చేసింది. అయితే సుశీంద్రన్ దర్శకత్వంలో ఆత్మన్ అనే సినిమాకి శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ కోసం మరల తన లుక్ ని పూర్తిగా మార్చుకోవడంపై దృష్టి పెట్టిన శింబు దానికోసం హెవీగా వర్క్ అవుట్స్ చేశారు. ఓ వైపు వాకింగ్ ఫిట్ నెస్ వర్క్ అవుట్స్ చేస్తూనే మరో వైపు బాక్సింగ్ ప్రాక్టీస్ చేశాడు. అలాగే క్లాసికల్ డాన్స్ కూడా నేర్చుకున్నారు. కర్రసాము కూడా కూడా నేర్చుకున్నాడు.

ఈ సినిమాలో శింబు క్యారెక్టర్ డిమాండ్ మేరకు డిఫరెంట్ వేరియేషన్స్ లో కనిపించాల్సి ఉంటుంది. ఈ కారణంగా అన్నింట్లో కూడా ప్రావీణ్యం సంపాదించాడు. దీనికోసం చాలా టైమ్ తీసుకున్నాడు. ఇక తాజాగా అతను సరికొత్త లుక్ తో ఫోటోని ట్విట్టర్ లో షేర్ చేశారు.

ఈ లుక్ లో పొడవైన గెడ్డంతో చాలా స్టైలిష్ గా శింబు ఉండటం విశేషం. ఇక ఆత్మన్ మూవీ కోసం శింబు బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ వీడియో కూడా యుట్యూబ్ లో షేర్ చేశారు.

అందులో శింబు వెయిట్ లాస్ కోసం ఏం చేసాడో అన్ని చూపించరు. ఫైనల్ గా ఆత్మన్ కోసం తీసుకున్న ఫోటో షూట్ తో ఎండ్ చేశారు. సుశీంద్రన్ తో గతంలో ఈశ్వరన్ అనే సినిమాని శింబు చేశాడు. ఈ మూవీ కూడా తమిళంలో హిట్ టాక్ సొంతం చేసుకుంది. కమర్షియల్ మాస్ చిత్రాల దర్శకుడిగా మంచి ఇమేజ్ ఉన్న సుశీంద్రన్ ఇప్పుడు ఆత్మన్ సినిమా కోసం శింబుని సరికొత్తగా ట్రెండీ లుక్ లో ఆవిష్కరించబోతున్నాడు అని ఈ లుక్ బట్టి తెలుస్తుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.