Begin typing your search above and press return to search.

మైత్రి నిర్మాతలకు మైండ్ బ్లాక్ చేసిన పఠాన్ డైరెక్టర్..!

By:  Tupaki Desk   |   26 Jan 2023 1:00 PM GMT
మైత్రి నిర్మాతలకు మైండ్ బ్లాక్ చేసిన పఠాన్ డైరెక్టర్..!
X
బాలీవుడ్ యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచాడు లేటెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్. లేటెస్ట్ గా పఠాన్ తో మరోసారి తన డైరెక్షన్ స్టామినా చూపించాడు. వార్ తర్వాత దాదాపు నాలుగేళ్ల గ్యాప్ తో పఠాన్ తో వచ్చాడు సిద్ధార్థ్ ఆనంద్. కొన్నాళ్లుగా హిట్ సినిమాకు నోచుకోని షారుఖ్ కి ఫస్ట్ టాక్ తోనే సూపర్ అనిపించేలా చేశాడు సిద్ధార్థ్ ఆనంద్. షారుఖ్ పఠాన్ కు పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ కి ఈ సినిమా సూపర్ ఫీస్ట్ అనేలా ఉంది. ఆ విషయంలో డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సక్సెస్ అయినట్టే అని చెప్పొచ్చు.

ఇక ఇదిలాఉంటే ఈ డైరెక్టర్ తన నెక్స్ట్ సినిమా ఫైటర్ చేస్తున్నాడు. హృతిక్ రోషన్ తో చేస్తున్న ఫైటర్ సినిమా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. హృతిక్ రోషన్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్టర్ చేసే హీరో ఎవరో కాదు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.

ఆల్రెడీ ప్రభాస్ తో సిద్ధార్థ్ కథా చర్చలు ముగిశాయి. ఈ సినిమాను తెలుగు నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్నారు. అంత బాగానే ఉంది కానీ ప్రభాస్ సినిమాకు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ చేస్తున్న డిమాండ్ మైత్రి వారికి షాక్ ఇచ్చింది.

టాలీవుడ్ లో వరుస క్రేజీ ప్రాజెక్ట్ లతో సెన్సేషనల్ ట్రాక్ రికార్డ్ ఏర్పరచుకున్న మైత్రి మూవీ మేకర్స్ హీరో స్టామినాని బట్టి బడ్జెట్ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గరు. కానీ సిద్ధార్థ్ ఆనంద్ వారిని ప్రభాస్ సినిమాకు 150 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగాడని టాక్.

డైరెక్టర్ కి 150 కోట్లా అని అవాక్కవ్వొచ్చు. అవును.. సినిమా బడ్జెట్ వందల కోట్లు అవుతున్నప్పుడు హీరోలే కాదు దర్శకులు అంతకంత పని చేయాల్సి ఉంటుంది. దానికి తగినట్టుగానే రెమ్యునరేషన్ తీసుకునే ఛాన్స్ ఉంటుంది.

పఠాన్ సినిమా రిజల్ట్ చూసి సిద్ధార్థ్ తో కమిట్ అవుదామని మైత్రి నిర్మాతలు వెయిట్ చేశారట. షారుఖ్ పఠాన్ కు ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ప్రభాస్ సినిమాకు అతన్నే డైరెక్టర్ గా ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది. ఏది ఏమైనా మైత్రి వారికే మైండ్ బ్లాక్ అయ్యేలా రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చాడు డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.