Begin typing your search above and press return to search.
డబ్బే డిసైడ్ చేయదు! 65 కోట్లు వదులుకున్న డైరెక్టర్!!
By: Tupaki Desk | 3 Jun 2023 11:00 AMకొన్నిసార్లు కొన్ని క్రేజీ కాంబినేషన్లు అనుకున్న విధంగా సాధ్యపడవు. చివరి నిమిషంలో మిడిల్ డ్రాప్ అయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకు తాజా ఉదాహరణ బాహుబలి ప్రభాస్ తో పఠాన్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ సినిమా. నిజానికి 'వార్' లాంటి బ్లాక్ బస్టర్ ని తెరకెక్కించిన సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నారని.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించనుందని చాలా కాలంగా ఫిలింసర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మైత్రి మూవీ మేకర్స్ నుంచి సిద్ధార్థ్ పెద్ద మొత్తంలో అడ్వాన్స్ కూడా అందుకున్నాడని ప్రచారమైంది.
అయితే తాజా సమాచారం మేరకు.. ఈ ప్రాజెక్టుకు సానుకూల పరిణామాలేవీ లేవు. ఏవీ అనుకున్న విధంగా సాధ్యపడడం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభాస్ - సిద్ధార్థ్ మధ్య డేట్స్ క్లాష్ సమస్యగా మారిందని తెలుస్తోంది. నిజానికి ప్రభాస్ తో సిద్ధార్థ్ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సుమారు 65కోట్ల పారితోషికం దర్శకుడికి చెల్లించేందుకు ఒప్పందం చేసుకుంది.
కానీ అనూహ్యంగా సిద్ధార్థ్ ఆనంద్ తన ప్రీకమిట్ మెంట్ ని పూర్తి చేయాల్సి ఉంది. అతడు తదుపరి యష్ రాజ్ బ్యానర్ తో ముందుకు సాగుతున్నాడని తెలిసింది.
యశ్ రాజ్ ఫిల్మ్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న 'టైగర్ Vs పఠాన్' చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించాల్సి ఉంది. షారుఖ్ ఖాన్- సల్మాన్ ఖాన్ లిద్దరినీ డైరెక్ట్ చేయడం ఏ దర్శకుడికైనా ఒక డ్రీమ్ లాంటిది. దీనిని సిద్ధార్థ్ వదులుకోబోవడం లేదు. భారతీయ సినిమా చరిత్రలోనే అతిపెద్ద స్పై థ్రిల్లర్ ని తెరకెక్కించేందుకు అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.
యష్ రాజ్ బ్యానర్ తో ఉన్న కమిట్ మెంట్ల కారణంగా ప్రభాస్ తో సినిమాకి సిద్ధార్థ్ కమిట్ కాలేకపోయాడు. అతడి రెండు క్రేజీ ప్రాజెక్టుల కోసం కాల్షీట్లు సర్ధుబాటు చేయలేకపోతున్నారని తెలిసింది. నిజానికి యష్ రాజ్ బ్యానర్ అతడికి చెల్లించే పారితోషికం 40కోట్లు మాత్రమే. కానీ మైత్రి సంస్థ 65కోట్లు ఆఫర్ చేసింది. అయినా మైత్రి ఆఫర్ ని సిద్ధార్థ్ సున్నితంగా తిరస్కరించారని తెలుస్తోంది. అంతేకాదు.. తనకు ముట్టిన అడ్వాన్స్ మొత్తాన్ని పే బ్యాక్ చేశారని కూడా టాక్ వినిపిస్తోంది.
'టైగర్ Vs పఠాన్' షూటింగ్ 2024లో ప్రారంభమవుతుంది. సిద్ధార్థ్ ప్రస్తుతం ఈ సినిమా కోసం తన డేట్ లను అలాట్ చేస్తున్నాడని తెలిసింది. భారతీయ సినీపరిశ్రమలో నెవ్వర్ బిఫోర్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని తెరకెక్కించేందుకు ఇద్దరు ఖాన్ లను కలుపుతూ ఒక అద్భుతమైన స్క్రిప్టును మలిచేందుకు సిద్ధార్థ్ ఆనంద్ టీమ్ ఇప్పటికే రేయింబవళ్లు శ్రమిస్తోందని తెలిసింది. సిద్ధార్థ్ ప్రస్తుతం హృతిక్ రోషన్ - దీపిక పదుకొనే ప్రధాన పాత్రల్లో ఫైటర్ మూవీని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విలన్ పాత్రలో నటించనున్నారు.